సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విచారణలో ఉండగా ఆయన తండ్రి కే కే సింగ్ తరపు న్యాయవాది రియా చక్రవర్తిపై సంచల ఆరోపణలు చేశారు. కేకే సింగ్ లాయర్ గా వ్యవహరిస్తున్న వికాస్ సింగ్ రియాకు సుశాంత్ పై ఏమాత్రం ప్రేమలేదు. కేవలం తన ఆర్థిక అవసరాల కోసం ఓ టిష్యు పేపర్ లా వాడుకుంది అన్నారు. నిన్న ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా చక్రవర్తి సుశాంత్ తో తనకు గల అనుబంధం అలాగే సుశాంత్ మానసిక స్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ డిప్రెషన్ కారణంగా వింతగా ప్రవర్తించే వాడని ఆమె చెప్పడం జరిగింది. 

దీనికి కౌంటర్ గా వికాస్ సింగ్ ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది. సుశాంత్ బ్రతికి ఉంటే రియా తన నుండి 500కోట్ల రూపాయలు లాక్కున్నా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడేవారు కాదు. ఆయన మరణం తరువాత కుటుంబం బాధతో రియాపై చర్యలకు దిగారు అన్నారు. సుశాంత్ పై ఎటువంటి ప్రేమ లేని రియా తనని అవసరాల కోసం వాడుకుంది అన్నారు. 

రియా చెప్పినట్లుగా సుశాంత్ మానసిక వేదనతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు అన్నారు. సుశాంత్ ని తన కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఆమె ద్రవ ప్రధార్దాలలో మత్తుమందు కలిపి ఇచ్చేది. మత్తులో ఉన్న సమయంలో తనకు కావలసిన పనులు చేయించుకొనేదని లాయర్ చెప్పడం జరిగింది. రియాపై లాయర్ వికాస్ సింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.