Asianet News TeluguAsianet News Telugu

రియల్ గ్యాంగ్ రేప్ నేపధ్యంలో సూర్య నెక్ట్స్

సూర్య హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

Suriya s Next Based On Real Gangrape Case! jsp
Author
Hyderabad, First Published Jun 28, 2021, 9:35 AM IST

విభిన్న చిత్రాల‌ కు కేరాప్ ఎడ్రస్ గా మారారు తమిళ హీరో సూర్య‌. యాక్షన్ సీరిస్  సింగం లాంటి సినిమాలు చేస్తూనే ఆకాశం నీ హ‌ద్దురా వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లోనూ కనిపించి మెప్పిస్తున్నారు. ఓటీటీ వేదికగా విడుదలైన ఆకాశం నీ హద్దురా సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లను రాబట్టింది. ఎయిర్ డెక్కన్ సంస్థ అధినేత గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అంతటా మంచి ప్రశంసలు వచ్చాయి. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన ప్రస్దానాన్ని కొనసాగిస్తున్న సూర్య మరో సినిమా కమిటయ్యారు. 

 నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ పాండిరాజ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే య‌దార్థ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో సూర్య లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఈ సినిమా కథ ఓ యదార్ధసంఘటన నేపథ్యంలో రెడీ చేసారు.  ‘పొల్లాచ్చి’లో జరిగిన ఒక భయంకరమైన గ్యాంగ్ రేప్ సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారట.  అత్యాచారం చేసిన నేర‌స్థుల‌ను శిక్షించే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో సూర్య క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో జరిగిన యధార్ద సంఘన  ఇది. పొల్లాచ్చిలో 16ఏళ్ల బాలికను 10 మంది యువకులు రెండ్రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. 

సూర్య పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, జులై 23వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ సినిమా యాక్షన్ .. ఎమోషన్ లతో సాగుతోంది. రీసెంట్ గా విడుదలైన పోస్టర్ లు సినిమా పై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

ఇక ఈ సినిమాలో సూర్య సరసన అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రపోషించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా తప్పకుండా సూర్యకు భారీ విజయాన్ని తెచ్చి పెడుతుందని అభిమానులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios