సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’ రివ్యూ

బయోపిక్ లతో ఓ సుఖం ఏంటంటే ప్రత్యేకమైన కథ తయారు చేసుకోవాల్సిన పని ఉండదు.రెడీగా ఉన్న చాలా సంఘటలను కలుపుతూ స్క్రీన్ ప్లే రెడీ చేసుకుంటే చాలు. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. బయోపిక్ లో భీబత్సమైన మలుపులు ఉండవు. జనాలకు ఇంట్రస్టింగ్ గా ఉంటుందని సొంత పైత్యం సీన్స్ కలిపితే పెదవి విరిచేస్తారు. ఇలా బాలెన్స్ చేసుకుంటూ బాగోలేనివి ప్రక్కన పెట్టి, బాగున్నవి ముడిపెట్టి బోర్ కొట్టకుండా నడపటం ఓ ఆర్ట్.  ఆ మధ్యన వెంకటేష్ తో గురు మూవీ తీసి మంచి హిట్ అందుకున్న దర్శకురాలు సుధా ఈ సాహసానికి ఒడిగట్టింది. డెక్కన్‌ ఎయిర్‌ లైన్స్‌ అధినేత జీఆర్‌ గోపినాథన్‌ జీవిత కథలో చిన్న చిన్న ఛేంజెస్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ క్రమంలో సుధ ఏ మేరకు సక్సెస్ అయ్యింది. సూర్య ఈ బయోపిక్ కు ఏ స్దాయి న్యాయం చేసారు. అసలు ఈ బయోపిక్ తీసేటంత ఉత్సాహపరిచిన యుఎస్ పి ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Suriya Aakaasam Nee Haddhu Ra Review jsp

కథ 
చంద్రమహేష్ అలియాస్ మహా (సూర్య) ఓ మిడిల్ క్లాస్ మనిషి. పల్లెటూరులోని ఓ స్కూల్ మాస్టర్ కొడుకు. వైమానికి దళంలో పనిచేస్తున్న అతన్ని ఓ సంఘటన పూర్తిగా మార్చేస్తుంది.  పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యం ఏర్పాటు చేస్తుంది. అందుకోసం అద్బుతమైన ఐడియాని ప్లాన్ రెడీ చేస్తాడు. అయితే అతని దగ్గర పెట్టుబడి లేదు. వెంచర్ కాపిటిలిస్ట్ లు ఎవరూ అతన్ని నమ్మే పరిస్దితి లేదు. అతని ప్రపోజల్ ఎవరూ ఏక్సెప్ట్ చేయటం లేదు.కుటుంబాన్ని అతని భార్య బేబి (అపర్ణ బాల మురళి) బేకరీ నడిపి రన్ చేస్తూంటుంది. ఏమైతేనేం అతను కష్టపడి  డెక్కన్ ఎయిర్ లైన్ స్టార్ట్ చేస్తాడు. కానీ  జాజ్ ఎయిర్ లైన్స్ ఓనర్ పరేష్ గోస్వామి (పరేష్ రావెల్) మాత్రం మాటిమాటికి అడ్డుతగులుతూంటాడు. ముందుకు వెళ్లనీయడు. ఈ క్రమంలో మహా ఎన్ని కష్టాలు పడ్డాడు ? అసలు తాను అనుకున్నది సాధించగలిగాడా ? లేదా ? ఇంతకీ తక్కువ ధరలో విమాన ప్రయాణం అనే ఆలోచన రావటానికి కారణం ఏమిటి ?అతని జీవితాన్ని ఆ ఆలోచన దిసగా మార్చిన సంఘటన ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
 
ఎలా ఉంది
సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవటం నా కల అన్నారంటే అర్దం ఉందనిపిస్తుంది. కానీ ఓ అతి సామాన్యూడు సొంత విమాన సంస్దను ఏర్పాటు చేసుకోవటం తన కల అని ప్రయాణించటం మాత్రం ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజ జీవిత సంఘటనల స్పూర్తితో ఈ సినిమా కథ రాయకపోతే ...ఊసుపోక రాసిన ఓ కాలక్షేపం కథ అని కొట్టిపారేద్దుము. కానీ ఓ మనిషి పట్టుదల పడితే..ఎంతటి ఉన్నతమైన లక్ష్యాన్ని అయినా ఉడుము పట్టులాంటి పట్టుతో సాధిస్తాడనేది నిజంగానే ప్రేరణ పొందాల్సిన అశం. అలాంటి కథను తెరకెక్కించాలనే సుధ కొంగర...ఆ పాత్రలో కనిపెంచిన సూర్య నిజంగా అభినందనీయులు. ఇక స్క్రిప్ట్ విషయాల్లోకి వస్తే..సరైన ట్రైట్మింట్ ఇవ్వలేదు. దాంతో అక్కడక్కడా గోపీనాథ్ జీవితాన్ని ఎలివేట్ చేసినా, సినిమా కమర్షియాల్టి కోసం రాసుకున్న మరికొన్ని సీన్స్ ప్రక్కకు లాగేసాయి. అలాగే జీవిత చరిత్ర అంటే నేచురల్ గా ఉండాలని ఆశిస్తాం. అది ఇక్కడ చాలా చోట్ల మిస్సైంది. సినిమాటెక్ సీన్స్ కు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటంతో ఇలాంటి సినిమాలకు ఉండే  బ్యూటీ మిస్సైంది. 

ఇక డ్రామా కోసం ఫిక్షన్ సీన్స్ బాగా పెంచేసారు. అలాగే కథలో తండ్రి,కొడుకు మధ్యన, భార్య,భర్త మధ్యన సీన్స్ రాసుకుంటూ పోయారు. నచ్చినవన్ని పెట్టేయటంతో లెంగ్త్ అమాంతం పెరిగిపోయింది. అవసరం సీన్స్ ప్రయారిటీ తగ్గిపోయింది. దానికి తోడు సినిమాకు వీక్ విలని.పరేష్ రావెల్ ఓ పెద్ద ఎయిర్ వేస్ సంస్దకు అధినేతగా చూపెడుతూ..అతని స్దాయికి అతి చిన్న విషయానికి అంత ప్రయారిటీ ఇవ్వటం ఆశ్చర్యమనిపిస్తుంది. క్రిమినిల్ ఏక్టివిటీస్ ని కూడా కలిపారు. అలా సినిమా టెక్ లిబర్టిని బాగా వాడుకున్నారు దర్శకురాలు.

ప్రీ క్లైమాక్స్ మరీ విసుగెత్తించింది. అయితే లెంగ్త్ పెరిగిందని తిట్టుకున్నా...కెప్టెన్‌ గోపీనాథ్‌ లైఫ్ ని పల్లె నుంచి విమాన సంస్థ అధిపతిగా ఎదిగిన క్రమం డిటేలింగ్ గా చూపించిన విధానం బాగుంది. దాదాపు అన్ని స్టేజీలని వదలకుండా కవర్ చేసారు.  అయితే హ్యూమన్‌ సక్సెస్‌ స్టోరీ వెండి తెరపైకి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు తప్పవు. అయినా సినిమా లాగ్ అనిపించినా, కొన్ని చోట్ల విసిగించినా సినిమా క్లైమాక్స్ లో పేద ప్రజలు విమానం దిగిన సీన్ వాటినన్నిటినీ అధిగమనించేస్తుంది. 

టెక్నికల్ గా..
సినిమాని టెక్నికల్ గా మంచి స్టాంటర్డ్స్ లో తెరకెక్కించటంలో దర్శకురాలు సక్సెస్‌ అయింది. అలాగే జీవీ ‍ ప్రకాశ్‌ అందించిన సంగీతం పెద్ద ప్లస్. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్  చాలా సీన్స్ కు ప్రాణం పోసింది.  నికెత్‌ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ కూడా సినిమాలో మరో హైలెట్. అయితే సూర్య వంటి స్టార్ సినిమాకు ఇలాంటి టెక్నికల్ స్టాండర్డ్స్ ఉండటం వింతేమీ కాదు. అయితే ఎడిటరే ఈ సినిమా లెంగ్త్ పెంచేసి ఇబ్బంది పెట్టాడు.

నటీనటులు పరంగా సూర్య సినిమాను ఒంటిచేత్తో మోసాడు. తన ఊరికి వెళ్లడానికి డబ్బులు లేక... టికెట్‌ కొనలేకపోయిన సందర్భంలో సూర్య నటన హైలెట్. సూర్య భార్యగా అపర్ణ చక్కగా నటించింది.  భక్తవత్సలం నాయుడు పాత్రలో మోహన్‌బాబు ,విలన్‌గా పరేశ్‌ రావల్‌ తమదైన శైలి నటనను మరోసారి చూపించారు. 

ఫైనల్ థాట్
విజేతల బయోపిక్ లు ఎప్పుడూ స్పూర్తిదాయకమే
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:3

-----------------

ఎవరెవరు..
తారాగణం: సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్‌బాబు, పరేష్‌ రావల్‌, ఊర్వశి తదితరులు
సంగీతం:  జీవీ ప్రకాశ్‌ కుమార్‌
ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మి
ఎడిటర్‌: సతీష్‌ సూర్య
స్క్రీన్‌ ప్లే: షాలిని ఉషాదేవి, సుధ కొంగర
మాటలు: రాకేందు మౌళి
కథ, దర్శకత్వం: సుధ కొంగర
నిర్మాత: సూర్య
విడుదల తేదీ: 12 నవంబర్, 2020 
స్ట్రీమింగ్ ఓటీటి:  అమెజాన్‌ ప్రైమ్‌ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios