ఈ మధ్యకాలంలో సురేష్ ప్రొడక్షన్స్ చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా పెళ్లి చూపులు తర్వాత వరసగా చిన్న సినిమాలు ప్రివ్యూలు చూడటం, నచ్చితే మొత్తం రైట్స్ తీసుకుని తమ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ద్వారా రిలీజ్ చేయటం చేస్తున్నారు. అందులో రానా పాత్ర కీలకమైనది. ఆయన కొత్తవారిని ఎంకరేజ్ చేయటంలో ముందు ఉంటున్నారు. దాంతో చిన్న సినిమా బాగుంటే సురేష్ బాబు తీసుకుంటాడనే ఉత్సాహం మేకర్స్ల్ లో కలుగుతోంది. తాజాగా రానా ఓ సినిమా ని చూసి తాము రిలీజ్ చేద్దామని నిర్ణయించుకున్నారట. ఆ చిత్రం మరేదో కాదు..ఫ‌ల‌క్‌నుమా దాస్. ఆ మధ్యన టీజర్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

మళయాళ చిత్రం రీమేక్ గా రెడీ అయ్యిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఆ సినిమా టీజర్ లో బూతు డైలాగులు ఉన్నాయి. లం…. కొడకా, గు…పగల్దే…. నమా , దే…… యాండ్రా  లాంటి కొన్ని బూతు డైలాగ్స్ ఉన్నాయి. అయితే సినిమాలో ఈ డైలాగ్స్ ఉంటాయా ? మ్యూట్ అవుతాయా ? అన్నది చూడాలి. ప్రతిష్టాత్మకమైన బ్యానర్ పై రిలీజ్ చేసేటప్పుడు వాటిని అలాగే ఉంచకుండా మారుస్తారా..తొలిగిస్తారా అనే విషయం చర్చనీయాంసంగా మారింది. 

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఫలక్ నుమా దాస్ . పెళ్లిచూపులు డైరెక్టర్ దాస్యం తరుణ్ భాస్కర్ పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించిన ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. ఫక్తు ఓల్డ్ సిటీ స్లాంగ్ లో తెరకెక్కిన ఈ ఫలక్ నుమా దాస్ ట్రైలర్ చూస్తుంటే సినిమా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఊర మాస్ డైలాగ్స్ తో యాక్షన్ సన్నివేశాలతో సాగింది ఫలక్ నుమా దాస్ ట్రైలర్. 

కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్ లుగా ప్రశాంతి , సలోని , హర్షిత లు నటించారు. పెళ్లిచూపులు వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.  దిపూర్తిగా హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్ లో సాగే చిత్రం. ఈ చిత్రంలో స‌లోని మిశ్రా, హ‌ర్షిత గౌర్‌, ప్రశాంతి లు ఫిమెల్ లీడ్  కేర‌క్టర్స్ లో క‌నిపిస్తారు.