టాలీవుడ్ డ్రగ్స్: ఆ సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకోకుండా పని చేయలేరు

suresh babu comments drug addicts in tollywood
Highlights

కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే

కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలతో అధికారులు వారిని విచారించారు. ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్నారనే వార్తలు కథనాలుగా ప్రచురించారు. అయితే తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించడంతో హాట్ టాపిక్ గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

''డ్రగ్స్ తీసుకునేవాళ్లను సినిమాలలో ఎంట్రీ లేదనే రూల్ పెట్టొచ్చు కానీ యూనిట్ మొత్తం డ్రగ్స్ తీసుకునేవారే అయితే అప్పుడు ఏం చేస్తాం. ఇండస్ట్రీలో అలాంటి గ్రూపులు కూడా ఉన్నాయి. కొందరు సెలబ్రిటీలు కథలు రాయడానికి, మ్యూజిక్ కంపోజ్ చేయడానికి కూడా డ్రగ్స్ తీసుకుంటారు. వాళ్లు ఎంత టాలెంటెడ్ అయినా.. డ్రగ్స్ తీసుకుకోకుండా మాత్రం పని చేయలేరు. డ్రగ్స్ తీసుకుంటేనే తప్ప వాళ్ల బ్రెయిన్ పని చేయదు. అలాంటి వాళ్లు నాకు చాలా మంది తెలుసు. వీళ్లందరినీ వదిలేసి.. పాపులర్ కాని కొందరు వ్యక్తులపై మాత్రమే యాక్షన్ తీసుకోవాల్సివస్తుంది'' అంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ చేశారు.

సురేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలతో అంతగా డ్రగ్స్ కు బానిసలైన ఆ పాపులర్ సెలబ్రిటీలు ఎవరై ఉంటారా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చాలా మంది  పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక డ్రగ్స్ తీసుకోవడం, సెక్స్ అనే విషయాలు ఎవరివారి పెర్సనల్ విషయాలని ఇండస్ట్రీతో దీన్ని ముడిపెట్టడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు.  

loader