రోబో చిత్రం పై ఉన్న కాపీరైట్ కేసును రద్దు చేయాలని కోరుతూ ప్రముఖ దర్శకుడు శంకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది . రచయిత తనపై దాఖలు చేసిన కేసును రద్దు చేయడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించడంతో ఈ తమిళ  డైరెక్టర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన కథ కాపీరైట్ ఉల్లంఘనపై ఆరూర్ అనే తమిళనాడు రచయిత 2010 లో మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు . పిటిషనర్.. జుగిబా పేరుతో తన కథను మొదటిసారిగా 1996 ఏప్రిల్‌లో ఇనియా ఉదయం అనే పత్రికలో ప్రచురించారని, అదే కథను 2007 లో టిక్ టిక్ దీపిక అనే నవలలో మళ్ళీ ప్రచురించామని చెప్పారు .

శంకర్ దర్శకత్వం వహించిన మరియు కళానిథి మారన్ నిర్మించిన రోబో చిత్రం తన రచనల కాపీ అని, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 420 (చీటింగ్) మరియు కాపీరైట్ చట్టంలోని ఇతర విభాగాల ప్రకారం దర్శకుడు శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డాడని ఆయన అన్నారు.  2019 లో మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది విల్సన్ ముందు విచారణకు వచ్చింది.ఆ కథకు, తన సినిమా కథకు అసలు  పోలిక లేదని శంకర్ వాదించారు.
 
పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది పి కుమారసన్ వాదిస్తూ... రెండు కథల మధ్య 29 పోలికలను ఎత్తిచూపారు. అంతేకాదు ఆరుర్   తన రచనలకు కలైమమణి అవార్డులతో గుర్తింపు పొందారని, రాష్ట్ర ప్రభుత్వం టిక్ టిక్ దీపిక అనే పుస్తకాన్ని కొనుగోలు చేసిందని అన్నారు.   రెండు వైపు వాదనలు  విన్న తరువాత, మద్రాస్ హైకోర్టు కేసును రద్దు చేయడానికి నిరాకరించింది.దాంతో శంకర్ ..సుప్రీం కోర్ట్ కు వెళ్లారు.

అయితే ఆ కేసును కొట్టి వేయడం కుదరదు అంటూ సుప్రీం కోర్టు శంకర్ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మద్రాస్ హైకోర్టులోనే ఆ కేసుకు సంబంధించిన వాదోపవాదనలు మళ్లీ మొదలు కాబోతున్నాయి. మరో ప్రక్క రచయిత అరూర్  నష్టపరిహారంగా కోటి రూపాయలను ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.