సాంకేతిక లోపం కారణంగా విమానాలు గంటల తరబడి టేకాఫ్ తీసుకోకుండా రన్‌వే పైనే ఉండిపోయిన ఘటనల్లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేరారు.

Also Read:'పూరి జగన్నాథ్, సునీల్ మోసం చేశారు.. రవితేజ మాత్రం..' హీరో కామెంట్స్!

సోమవారం ఉదయం చెన్నై నుంచి మైసూర్ వెళ్లాల్సిన ఓ ప్రైవేట్ విమానంలో టేకాఫ్‌కు ముందు సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని గుర్తించిన సిబ్బంది విమానంలోని 48 మంది ప్రయాణికులను దింపేశారు. వీరిలో తలైవ కూడా ఉన్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో రజనీకాంత్‌ను చూసిన అభిమానులు ఆయనతో ఫోటోలు దిగగా, సూపర్‌స్టార్ కూడా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత నిపుణులు సాంకేతిక లోపాన్ని సవరించగా విమానం టేకాఫ్ అయ్యింది.

Also Read:అల వైకుంఠపురములో జోరు.. 'భరత్ అనే నేను' రికార్డ్ బ్రేక్

కాగా ద్రవిడ పితామహుడు, సంఘసంస్కర్త పెరియార్ రామస్వామి నాయకర్‌పై ఇటీవల రజనీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జనవరి 14న చెన్నైలో జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. పెరియార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.