కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే నెలకో సినిమాని రిలీజ్ చేస్తారేమో అనిపిస్తోంది. ఒక సినిమా స్టెన్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ ని మొదలెట్టేస్తున్నారు. సమయాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా 60 ఏళ్లలో కూడా మంచి ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు, సూపర్ స్టార్ స్పీడ్ ని చూసి కుర్ర హీరోలు కూడా షాకవుతున్నారు.

ఇటీవల మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా శివ చెప్పిన కాన్సప్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమా అఫీషియల్ ఎనౌన్మెంట్ వచ్చేసింది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ రజినీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నాడు. కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ లోనే సినిమాని రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. ప్రస్తుతం డైరక్టర్ శివ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

ఇక సినిమాని ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్స్ పై నిర్మించనున్నారు. గతంలో ఈ ప్రొడక్షన్ లో రజినీకాంత్ రోబో - కాలా సినిమాలు చేశారు. కలెక్షన్స్ పరంగా కాలా కాస్త తడబడినా రోబో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ముడవసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అంచనాల డోస్ పెరిగింది. మరి సినిమా ఎలాంటి బిజినెస్ చేస్తుందో చూడాలి.