సూపర్ స్టార్ రజినీకాంత్ ని తమిళనాడులో అభిమానులు దేవుడిగా ఎందుకు కొలుస్తారో మరోసారి రుజువయ్యింది. తలైవా అనుకుంటే ఏదైనా చేయగలుగుతారని ఇచ్చిన మాట వెనక్కి తీసుకోరని నీరూపితమయ్యింది. గత నెల ఒక సినీ నిర్మాత అద్దె ఇంట్లో ఉంటున్నాడని తెలిసి రజిని వెంటనే ఒక ఇల్లు ఇస్తానని మాట ఇచ్చారు.

నా మొదటి సినిమా నిర్మాత కలైజ్ఞానం లేకుంటే నేను కథానాయకుడిగా నిలదొక్కుకునేవాడిని కాదని విలన్ గా ఉన్న నన్ను హీరోగా చూపించి మంచి జీవితాన్ని ఇచ్చారని ఆ సభలో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం నెల రోజులు గడవకముందే గృహ ప్రవేశం చేయించారు. గత నెలలో సీనియర్ కథారచయిత, నిర్మాత కలైజ్ఞానంకు సీనియర్ దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో సన్మానసభ జరిగింది.  

న్నైలో జరిగిన ఈ సభకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈవెంట్ లో రజినీకాంత్ ప్రభుత్వం ఆదుకోకముందే తన కెరీర్ సక్సెస్ కి ముఖ్య కారణమైన కలైజ్ఞానం ఇల్లు ఏర్పాటుచేస్తానని అన్నారు. ఇక నేడు గృహ ప్రవేశం చేయించిన సూపర్ స్టార్ తానేంటో నిరూపించుకున్నాడు. అభిమానులు తలైవా చేసిన పనికి సంతోషపడుతూ అందుకే ఆయన దేవుడయ్యాడు అని కామెంట్  చేస్తున్నారు.