బాలీవుడ్ అనే కాకుండా సౌత్ లో కూడా తనదైన ముద్ర వేసుకున్న బ్యూటీ సన్నీ లియోన్. పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మడు ఇంకా తన అరకొర అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తూనే ఉంది. ఇక అదే బాటలో ఆమె సహోదరి కూడా అడుగుపెట్టింది. సన్నీ సిస్టర్ మియా రాయ్ లియోన్ పోర్న్ ఇండస్ట్రీలో బాగానే క్లిక్ అయ్యింది. 

అయితే సిస్టర్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఇప్పుడు తనదైన శైలిలో గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఒక కోలీవుడ్ సినిమాలో నటిస్తోంది. విమల్, ఆశ్నాజవేరి జంటగా నటిస్తున్న 'ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్‌ ఇరుక్కు' అనే సినిమాలో ఈ హాట్ బ్యూటీ ఒక ప్రత్యేక పాత్రలో నటించింది. పూర్ణ కూడా ఒక పోలీస్ పాత్రలో మెరవనుంది. 

ఏఆర్.ముకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐరోపాలో టాప్ మోస్ట్ అడల్ట్ స్టార్ గా వెలిగిన మియా రాయ్ లియోన్ ఇప్పుడు కోలీవుడ్ కి వస్తోంది అనగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అయ్యింది. మరి ఈ బ్యూటీ సన్నీ రేంజ్ లో అదరగొడుతుందో లేదో చూడాలి.