Asianet News TeluguAsianet News Telugu

ఈ టీజర్ లో బూతులు చూసి సన్నిలియోన్ షాక్

 సన్నీ లియోన్ చేత లాంచ్ చేయించారు. టీజర్ చూసిన సన్నీ ఆ సీన్స్ కు షాక్ అయ్యింది. అమేజింగ్ అని ప్రశంసలు కూడా కురిపించారు. ప్రస్తుతం టీజర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sunny Leone Released Boys Movie Teaser jsp
Author
Hyderabad, First Published Jul 17, 2021, 1:16 PM IST

పోర్న్ స్టార్ గా ఉండి.. తర్వాత బాలివుడ్ యాక్ట్రెస్ గా మారిన సన్నిలియోన్ తను చేసిన పనులు, చేస్తున్న సామాజిక సేవల ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకుంది.. పోర్న్ స్టార్ అంటేనే అదో రకంగా చూసే మన దేశంలో సన్నిలియోన్ తర్వాత ఆ ఆలోచన మారిపోయింది.ఆమె ఎంత పాపులర్ అయ్యిందంటే తెలుగులోనూ ఆమె సినిమాలు చేసింది. ఇక్కడా ఆమెకు ప్యాన్స్ ఉన్నారు. అలాంటి సన్నిలియోన్ సైతం ఓ టీజర్ లో  బోల్డ్ సీన్స్ చూసి షాక్ అయ్యింది. అదీ తెలుగు సినిమా టీజర్ కావటం, ఆమే లాంచ్ చేయటం విశేషం.

ఈ సినిమా టీజర్ ను హాట్ బ్యూటీ సన్నీ లియోన్ చేత లాంచ్ చేయించారు. టీజర్ చూసిన సన్నీ ఆ సీన్స్ కు షాక్ అయ్యింది. అమేజింగ్ అని ప్రశంసలు కూడా కురిపించారు. ప్రస్తుతం టీజర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అడల్ట్ సీన్లతో పాటు బూతులు కూడా వాడేశాడు.సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతుంది. బాయ్స్ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ద‌యానంద్ ఓ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ ల‌వ్ స్టోరీగా రెడీ చేశార‌నే విష‌యం ఈ టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. 

 

డైన‌మిక్ లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు.

  శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రాజా హే రాజా అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ఈ పాటను పాడారు.

 నటీనటులు: గీతానంద్, మిత్ర శర్మ, రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాన్, జెన్నిఫర్ ఎమ్మాన్యూయేల్, శీతల్ తివారి, సుజిత్, బంచిక్ బబ్లు, కౌశల్ మంద, రమ్య  తదితరులు. టెక్నికల్ టీమ్: రచన, దర్శకత్వం: దయానంద్, నిర్మాత: మిత్రా శర్మ, సహ నిర్మాత: పడవల బాలచంద్ర, సంగీత దర్శకుడు: స్మరన్, గాయకుడు: రాహుల్ సిప్లిగంజ్, లిరిక్స్: శ్రీమణి, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, కొరియోగ్రఫీ: జావేద్,లిరికల్ వీడియో: సాయివిహార్ పంతంగి, ప్రొడక్షన్ డిజైన్: దిలీప్ జాన్, రవి మొండ్రు.
 

Follow Us:
Download App:
  • android
  • ios