పోర్న్‌ రంగం నుంచి బాలీవుడ్‌ లోకి అడుగుపెట్టిన అందాల భామ సన్నీ లియోన్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ లాస్‌ ఏంజిల్స్‌లో ఉంటోంది. అయితే ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ముంబై తిరుగు ప్రయాణంపై స్పందించింది సన్నీ. వీలైనంత త్వరగా తనకు కూడా ముంబై తిరిగి రావాలని ఉందని వ్యాఖ్యానించింది సన్నీ. అంతేకాదు ఈ బ్యూటీ మాట్లాడుతూ.. `నాకు అసలు ముంబైని వదిలి పెట్టడం ఇష్టం లేదు. ఇక అంతర్జాతీయ విమానాలు ఎప్పుడు ప్రారంభమైతే అప్పుడే ఇండియాకు తిరిగి వస్తా. వీలైనంత త్వరగా ఇండియా వచ్చేందుకు ప్రయత్నిస్తా` అంటూ చెప్పుకొచ్చింది.

అదే సమయంలో తాను లాస్‌ ఎంజెల్స్‌ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించింది సన్నీ. `నాకు ముంబై ఇంటిని వదిలి రావటం అసలు ఇష్టం లేదు. కానీ మేం ఇక్కడికి రావటం ఎంతో ఇంపార్టెంట్‌. నా భర్త డానియల్‌ తల్లి ఆయన కుటుంబం ఇక్కడే ఉంటున్నారు. అందరి లాగే వాళ్లు కూడా ఈ విపత్కర సమయంలో తమ పిల్లలతో కలిసి ఉండాలనుకున్నారు. అందుకే మేం ఉన్నపలంగా లాస్‌ ఏంజెల్స్‌ కు వచ్చాం` అని వివరించింది అంతేకాదు తన పిల్లలు కూడా ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారని వివరించింది.

 

అయితే లాస్‌ ఏంజిల్స్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సన్నీలియోన్‌ అక్కడి నుంచి రెగ్యులర్‌గా అప్‌డేట్స్‌ ఇస్తుంది. వరుసగా ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తోంది. చివరగా స్ల్పిట్స్ విల్లా అనే టీవీ రియాలిటీ షోలో కనిపించింది సన్నీ. బిగ్ బాస్‌ సీజన్‌ 5తో ఇండియన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సన్నీ, తరువాత బాలీవుడ్‌ లో జిస్మ్‌ 2, హేట్‌ స్టోరీ 2, రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్‌ 2 లాంటి సినిమాల్లో నటించింది. అంతేకాదు పలు భాషల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ ఆడి పాడింది.