సన్నీ లియోన్...ఈ పేరు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో చాలాకాలంగా మార్మోగిపోతోంది. కెనడా పోర్న్ స్టార్‌గా కెరీర్ మొదలుపెట్టిన సన్నీ..అటు నుంచి ఇటు బాలీవుడ్‌లో అడుగుపెట్టి తన సత్తా చాటుకుంది. ఐటెమ్ నంబర్లతో పాటు అందివచ్చిన సినిమా అవకాశాలను కూడా తనదైన శైలిలో పోషిస్తూ నటన పరంగా రొటీన్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనని నిరూపించుకుంది ఈ గార్జియస్ బ్యూటీ. ఆమె జీవితం త్వరలోనే తెరపై ఆవిష్కృతం కానుంది. అయితే అది సినిమాగా కాదు. వెబ్ సిరీస్‌ రూపంలో  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె అసలు పేరు 'కరణ్‌జీత్ కౌర్'. ఇప్పుడు తీయనున్న వెబ్ సిరీస్‌కు 'కరణ్‌జీత్' పేరు పెట్టినట్లు తెలిసింది. ఇందులో టైటిల్ రోల్‌ సన్నీ పోషిస్తుందా? లేదా మరెవరైనా పోషిస్తారా? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఈ వెబ్ సిరీస్ విషయాన్ని సన్నీయే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సిరీస్‌లో తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆసక్తికరంగా తెరకెక్కించనున్నట్లు ఈ సెక్సీ తార తెలిపింది. కొన్ని రోజుల కిందటే దక్షిణాదికి చెందిన మరో శృంగార తార షకీలా జీవితం వెండితెరపైకి ఎక్కించనున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.