సన్నీ అనేది నా పేరు కాదు.. పోర్న్ స్టార్ ఆవేదన!

Sunny leone Gets Emotional After Watching Her Biopic
Highlights

ఈ సిరీస్ ను చూసిన సన్నీలియోన్ కన్నీటి పర్యంతమైందట. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సన్నీ.. ఈ సిరీస్ లో చూపించిన ప్రతి సన్నివేశం నిజమేనని, ప్రతీ కన్నీటి బొట్టు నిజమైందని, తనకు తానే పోర్న్ స్టార్ గా మారానని వెల్లడించింది

అడల్ట్ కంటెంట్ సినిమాలతో పాపులర్ అయిన నటి సన్నీలియోన్ ను బాలీవుడ్ కు తీసుకొచ్చి హీరోయిన్ గా అవకాశాలు ఇప్పించారు. అతి తక్కువ సమయంలో బాలీవుడ్ లో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. పోర్న్ స్టార్ నుండి ఫిలిం హీరోయిన్ గా తన ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది..? పోర్న్ స్టార్ గా ఆమె ఎందుకు మారిందనే..? విషయాల ఆధారంగా 'కరణ్ జిత్ కౌర్.. ది  అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్' అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు.

సన్నీలియోన్ స్వయంగా ఈ సిరీస్ లో నటించడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ఈ సిరీస్ ను చూసిన సన్నీలియోన్ కన్నీటి పర్యంతమైందట. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సన్నీ.. ఈ సిరీస్ లో చూపించిన ప్రతి సన్నివేశం నిజమేనని, ప్రతీ కన్నీటి బొట్టు నిజమైందని, తనకు తానే పోర్న్ స్టార్ గా మారానని వెల్లడించింది.

ఇక సన్నీ అనేది  తన పేరు కాదని.. తన అన్నయ్య పేరని.. ఆ పేరుతోనే పోర్న్ స్టార్ గా పాపులర్ అయినట్లు వివరించింది. ఇక ఈ సినిమా టైటిల్ లో కౌర్ అనే పదాన్ని ఉపయోగించడంతో ఆ పదాన్ని వెంటనే.. తొలగించాలని సిక్కుమత పెద్దలు భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. 

loader