Asianet News TeluguAsianet News Telugu

సన్నీ లియోనీ తల్లి అయింది..

  • తల్లయిన పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీ లియోనీ
  • మహారాష్ట్ర లాతూర్ కు చెందిన చిన్నారి దత్తత
  • తాను ఈ రకంగా తల్లి కావడంపై ఉబ్బితబ్బిబ్బవుతున్న సన్నీ
sunny leone and weber bacame mother adopting a girl child

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ అంటే ఇప్పుడు భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేవరేట్ హీరోయిన్ అని చెబుతారు.  ఇక భారత దేశంలో మోస్ట్ వ్యూడ్ ఫోటో అంటే సన్నీలియోన్ అనే చెబుతారు.  ఇక్కడ బాలీవుడ్ హీరోల తర్వాత గూగుల్ లో అంత గొప్పగా ఫేమస్ అయ్యింది సన్నీలియోన్ ఒక్కరే.  జిస్మ్ 2 చిత్రంతో బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ తర్వాత వచ్చిన సినిమాల కన్నా ఐటమ్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయ్యింది.  

 

 

తెలుగు లో మంచు మనోజ్ తో ‘కరెంటుతీగ’ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది.  ఇక ఈ మద్య షారూఖ్ ఖాన్ నటించిన ‘రాయిస్’ చిత్రంలో ఐటమ్ సాంగ్ తో దుమ్ము దులిపింది.  ఇక సన్నీలియోన్ తన సహ నటుడు అయిన వెబర్‌ ను 2011 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.  మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన 21 నెలల వయసున్న పాపను సన్నీ-వెబర్‌ దంపతులు దత్తత తీసుకున్నారు.

 

 

అంతే కాదు ఆ పాపకు నిషా కౌర్‌ వెబర్‌ అని పేరు పెట్టారు. అమ్మను కావడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందని సన్నీ ఓ జాతీయ పత్రికతో చెప్పారు. తన భావాలు వ్యక్తం చేయలేకపోతున్నాని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, లాతూర్‌ మహారాష్ట్రలో అత్యంత నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతం అన్న విషయం తెలిసిందే.

 

Follow Us:
Download App:
  • android
  • ios