ఓ వ్యక్తి తన పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నాడని ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మేనల్లుడిని అంటూ ప్రచారం చేసుకుంటూ.. కొందరి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని సునీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనకు చైతన్య అనే మేనల్లుడు లేడని, దయచేసి ఎవరూ అతని వలలో పడి మోస పోవద్దని కోరారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేసారు.

https://www.facebook.com/singer.sunitha/videos/292474378852011/?v=292474378852011

సునీత  మాట్లాడుతూ.. ‘‘నేను అందరికీ ఒక విషయంపై క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. చైతన్య అనే అతను నా మేనల్లుడు అని చెప్పి, సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకుంటున్నాడట. అవకాశాలు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని కూడా తెలిసింది. ఇది తెలిసి నేను షాక్ అయ్యాను. నాకసలు  చైతన్య అనే మేనల్లుడు లేనే లేడు. దయచేసి ఇకపై ఎవరూ మోసపోకండి. మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా చెబుతున్నాను. 

అయినా ప్రతి రోజూ ఇలా ఇండస్ట్రీలో మోసాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా ఎలా మోసపోతున్నారు. సెలబ్రిటీకి చుట్టం అనగానే ఎందుకు వారికి డబ్బులిచ్చి మోసపోతున్నారు. కొంచమైనా ఆలోచించరా? ఇకపై బయటి వ్యక్తులు ఎవరైనా ఇలా చెబితే కాస్త ఆలోచించండి. డబ్బులు పోగోట్టుకోవద్దు. ఆ చైతన్య అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు..’’ అని సునీత ఈ వీడియోలో తెలిపారు.