ఈ ఫస్ట్ గ్లిట్చ్‌లో హీరో సుమంత్ ఆర్జే నిలయ్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన వీడియో ప్రకారం ఈ సినిమాలో సుమంత్ రేడియో జాకీ ‘నిలయ్’ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా మళ్లీ మొదలైంది సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు హీరో సుమంత్. ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. కెరీర్ ప్రారంభం నుంచి సరైన హిట్ లేక తడబడుతున్న సుమంత్ తన ప్రయత్నాలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. తాజాగా సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లిట్చ్‌ను విడుదల చేశారు. ఈ గ్లిట్స్ కొత్తగా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ఇది చూసిన హిట్ కొడతాడేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో సుమంత్ నటిస్తున్న సినిమా “అహం రీబూట్’’ ఇది సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాని రఘువీర్ గొరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుణ్ అంకర్ల సినిమాటోగ్రఫీ అందించిన ఈ మవీకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందింస్తున్నారు.
ఈ ఫస్ట్ గ్లిట్చ్‌ను యంగ్ హీరో అడవి శేష్ ట్విటర్ వేదికగా రిలీజ్ చేస్తూ మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. ఈ ఫస్ట్ గ్లిట్చ్‌లో హీరో సుమంత్ ఆర్జే నిలయ్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన వీడియో ప్రకారం ఈ సినిమాలో సుమంత్ రేడియో జాకీ ‘నిలయ్’ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ జేగా తనను తాను పరిచయం చేసుకుంటుండగా ఓ అపరిచిత యువతి కాల్ రేడియో జాకీకి కనెక్ట్ అవుతుంది..
‘ఐ యామ్ కిడ్నాప్డ్, ప్లీజ్ డోంట్ డిస్ కనెక్టది కాల్’ అని ఆమే చెప్పే మాటలతో సస్పెన్స్ గా సాగుతుంది వీడియో.. అసలు ఆమెను ఎవరు, ఎలా, ఎందుకు కిడ్నాప్ చేశారన్నది ట్విస్ట్‌గా మారుతుంది. ఈ ప్రశ్నలను అందరిలో మరింత క్యూరియాసిటీని కలిగిస్తాయని మేకర్స్ వీడియోను అక్కడికే వదిలేశారు. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.
