క్రియేటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సుకుమార్...రంగస్దలంతో పెద్ద హిట్ కొట్టారు. అయితే ఊహించని విధంగా ..సుకుమార్ కు రెండు సంవత్సరాలు బ్రేక్ వచ్చింది. ఫైనల్ గా అల్లు అర్జున్ తో పుష్ప ని పట్టాలు ఎక్కిస్తున్నారు. కరోనా ,లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ నేపధ్యంలో ఆయన తన ఆలోచనలను ఓ మీడియా ఛానెల్ తో పంచుకున్నారు. అందులో భాగంగా ఆయన చెప్పిన ఓ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా మందికి ఆశ్చర్యం వేసింది. ఏమిటా విషయం అంటే...

సుకుమార్ మాట్లాడుతూ...మొదటి నుంచి కూడా నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. ఈ మధ్యనే తెలంగాణ సాయుధ పోరాటం గురించిన పుస్తకం చదివాను. 'రంగస్థలం' తరువాత తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలోనే సినిమా చేయాలని అనుకున్నాను .. కానీ కుదరలేదు' అని చెప్పుకొచ్చాడు. దాంతో ప్రస్తుతం చేస్తున్న పుష్ప తర్వాత  తెలంగాణ సాయుధ పోరాటం గురించి సుకుమార్ సినిమా చేసేలానే కనిపిస్తున్నాడని మీడియా వర్గాలు అంటున్నాయి. తెలంగాణా సాయుధ పోరాటం పై సినిమా అనగానే ఇండస్ట్రీలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే పీరియడ్ సినిమాలకు ఇప్పుడున్న డిమాండ్ తో త్వరలో ఈ చిత్రం పట్టాలు ఎక్కినా ఆశ్చర్యం లేదంటున్నారు. 

ప్రస్తుతం సుకుమార్ తన తాజా చిత్రం  'పుష్ప' సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా వున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగుకి బ్రేక్ ఇచ్చినా, స్క్రిప్ట్ కి సంబంధించిన .. కాస్ట్యూమ్స్ కి సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే లాక్ డౌన్ ఎత్తేసాక.. షూటింగుకి వెళ్లిన తరువాత ఎక్కడా గ్యాప్ రాకుండా ప్లాన్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.  మిగతా పాత్రల లుక్స్ కి సంబంధించిన విషయాల్లోను క్లారిటీకి రావడం జరిగిందని చెప్పాడు.