ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తెరపై ఎంత ఎమోషనల్ సన్నివేశాలను ఆవిష్కరిస్తూంటారో..నిజ జీవితంలోనూ అంతకు మించి ఉంటారు. అందుకే ఆయనకు స్నేహితులకు కన్నా సన్నిహితులు ఎక్కువ. స్టాఫ్ కన్నా తనవారు ఎక్కువ. వారి సంక్షేమం, క్షేమం నిత్యం కోరుకుంటూంటారు. అయితే సుకుమార్ కు  అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ మార్చి నెలాఖరున మరణించారు. దర్శకుడు సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ప్రసాద్ ఒకరు. తన మిత్రుడు మరణంతో తీవ్ర ఆవేదన కి లోనయ్యారు సుకుమార్. ప్రసాద్ పుట్టినరోజున సుకుమార్ తనని గుర్తు చేసుకుంటూ ఇన్స్ట గ్రామ్ లో ఉద్వేగభరిత పోస్ట్ పెట్టారు. 

https://www.instagram.com/p/B_5Zmz1lIDS/?utm_source=ig_embed

మొదట లేకపోవడం అంటే ఏంటీ అని ప్రశ్నిస్తూ మొదలెట్టిన  సుకుమార్‌.. చివరకు తనకు ఆ పదం అర్థమైందని పేర్కొన్నారు. లేకపోవడం అంటే.. మనం ‘ఈ బతుకు’ అనే లాక్‌డౌన్‌లో బందీగా ఉండటమే అని అభిప్రాయపడుతూ ఓ కవితలాంటి కథనం ముగించారు. లాక్‌డౌన్‌లో కూడా నా జ్ఞాపకాల్లో స్వేచ్చగా తిరుగుతున్న ‘బావగాడికి(ప్రసాద్‌)’ జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు.  సుకుమార్‌కు అత్యంత సన్నిహతుడై ప్రసాద్‌ మార్చి 28వ తేదీన గుండెపోటుతో కన్నుమూశారు. ప్రసాద్‌ సుకుమార్‌ వద్ద మేనేజర్‌ కూడా పనిచేసేవారు.

ఇక సుకుమార్‌ సతీమణి తబిత కూడా ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘ప్రసాద్‌ అన్నయ్య నువ్వు మమల్ని విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోయిన నిజాన్ని.. జీర్ణించుకోవడం చాలా కష్టం.  నీ స్వచ్ఛమైన చిరునవ్వును మరిచిపోవడమనేది జరగని పని. నిన్ను ప్రతిరోజు మేము గుర్తుచేసుకుంటూనే ఉంటాం.. మరీ ముఖ్యంగా ఇవాళ నీ పుట్టిన రోజునా. నువ్వు ఎప్పుడూ మా గుండెల్లో ఉంటావు’ అని పేర్కొన్నారు.