Asianet News TeluguAsianet News Telugu

‘పుష్ప’ లొకేషన్ ఛేంజ్: బ్యాంకాక్ టు ఈస్ట్ గోదావరి

అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో పలు కీలక సన్నివేశాలను మన రాష్ట్రాల్లోనే పూర్తి చేయాలని చిత్రం టీమ్  భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Sukumar make location changes to Pushpa
Author
Hyderabad, First Published May 19, 2020, 2:56 PM IST

కరోనా ప్రభావంతో మొదట అనుకున్న ప్లానింగ్ అంతా తల క్రిందులు అయ్యిపోతోంది సినిమావాళ్లకు. ముఖ్యంగా విదేశీ లొకేషన్స్ ప్రస్తుతానికి అందని ద్రాక్షే. ఈ నేపధ్యంలో తెలుగులో పెద్ద సినిమాలు తమ ఫారిన్ షెడ్యూల్స్ ని ఇండియాలో..అదీ అవకాసం ఉంటే తెలంగాణా, ఆంధ్రాలో లాగించెయ్యటానికి ప్లానింగ్ లో ఉన్నారు. అదే పద్దతిని అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న  ‘పుష్ప’ టీమ్ కూడా ఫాలో కానుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌ భారీ బడ్డెట్ తో  ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో అనేక కీ సీన్స్ ను మొదట బ్యాంకాక్ ఫారెస్ట్  లో ప్లాన్ చేసారు.  ఆ తర్వాత కేరళలో కొంత భాగం ప్లాన్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అవన్నీ ప్రక్కన పెట్టి తూర్పు గోదావరి జిల్లా లోని రంపచోడవరం అడవుల్లో ముగించాలని నిర్ణయించినట్లు సమాచారం. 

ఈ విషయం గురించి ‘పుష్ప’ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్‌ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం కరోనా వల్ల కావాలనుకున్న చోట షూటింగ్‌ చేయాలనుకోవడం కచ్చితంగా కుదరదు. అలాగని మా సినిమాకు ఇంకా సెట్‌ వర్క్‌ ఏం ప్రారంభించలేదు.అలాగే అడవి ప్రాంతాల్లో షూటింగ్‌ ఎక్కువ శాతం ఉంది. చిత్తూరు, వికారాబాద్‌ అడవుల్లో షూట్‌ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అన్నీ కుదిరితే కేరళలో కొంత భాగం షూట్‌ చేస్తాం. మా బ్యానర్‌ లో మిగతా సినిమాల్లో ఏదైనా ఫారిన్‌ లో ఉంటే తర్వాత ఆలోచిస్తాం. సినిమా అంటేనే క్రియేషన్‌. క్రియేటివ్‌ వర్క్‌ని ఇక్కడే చేయాలి.. అక్కడే చేయాలని రూల్స్  పెట్టుకోలేం.అలాగని అన్ని సినిమాలూ ఇండియాలోనే చేస్తామా? అంటే ఇప్పుడే ఏం చెప్పలేం’’ అని పేర్కొన్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘పుష్ప’‌. ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశం కోసం భారీ బడ్జెట్‌ కేటాయించారు. ఇందులోని ఆరు నిమిషాల సన్నివేశం కోసం రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సీన్‌ సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొంది. అంతేకాదు ఈ సినిమా కోసం కేవలం భారత్‌ దేశంలోని టెక్నీషియన్స్ తో  మాత్రమే పనిచేయబోతున్నారు. ఇది మేడిన్‌ ఇండియా ప్రాజెక్టని, భారత్‌లోని కళాకారులకు ఉపాధి కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని యూనిట్‌ పేర్కొంది. అయితే ఇప్పుడు కరోనా ప్రభావంతో ఇతర దేశాలకు వెళ్లే పరిస్దితి లేదు.   ఈ చిత్రం ఎమోషన్స్, కొన్ని వాస్తవిక సంఘటనలతో మిళితమై ఉంటుంది. అదే ప్లస్ పాయింట్ కానుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారట. 

‘అల వైకుంఠపురములో..’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా ఇది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హీరోయిన్. ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, వెన్నెల కిశోర్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా   నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ ‌స‌ంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios