టాలీవుడ్ లో సుకుమార్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సుకుమార్ తెరకెక్కించిన చిత్రాలకు సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఓ ప్రత్యేకత ఉంటుంది. సుకుమార్ రూపొందించే సినిమాలన్నీ విభిన్నంగా ఉంటాయి. సుకుమార్ ప్రేమ కథలు తెరకెక్కించినా, కమర్షియల్ సినిమాలు రూపొందించినా అందులో కొత్తదనం ఉంటుంది. 

సుకుమార్ గత ఏడాది రంగస్థలం చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రంగస్థలం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోమవారం రోజు సుకుమార్ 'రాజువారు రాణిగారు' అనే చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. 

ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన కిట్టయ్య అనే వ్యక్తిని సుకుమార్ మీడియాకు పరిచయం చేశాడు. కిట్టయ్య తన స్నేహితుడు అని సుకుమార్ పేర్కొన్నారు. తన స్నేహితుడి గురించి మాట్లాడుతూ సుక్కు ఎమోషనల్ అయ్యాడు. 

విజయ్ దేవరకొండ మూవీ.. పూరి ఆ హీరోయిన్ ని వదిలేలా లేడుగా!

నా నిజమైన స్నేహితుడు కిట్టయ్య. మనకు తెలిసిన వారు ఎవరు కనిపించినా నా స్నేహితుడు అని మాటవరసకు పరిచయం చేస్తాం. కానీ కిట్టయ్య అలాంటి వాడు కాదు. నా నిజమైన మిత్రుడు. నాకు కాలులో ముళ్ళు గుచ్చుకున్నా కిట్టయ్య తట్టుకోలేడు. నాకు చిన్నప్పుడు సినిమాలంటే బాగా ఇష్టంగా ఉండేది. కానీ డబ్బు ఉండేది కాదు. 

రాంచరణ్ హీరోయిన్ సెక్సీ ఫోజులు.. హాట్ ఫొటోస్ వైరల్!

కిట్టయ్య కూలికి వెళ్లి తెచ్చిన డబ్బుతో నన్ను సినిమాలకు తీసుకుని వెళ్ళవాడు. చిన్నతనంలో కిట్టయ్యతో కలసి సినిమాలు చూడడం వల్లే తాను ప్రస్తుతం దర్శకుడిగా రాణించగలుగుతున్నానని సుకుమార్ తెలిపారు. నా స్నేహితుడికి ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని సుకుమార్ తెలిపారు. నేను 100% లవ్ చిత్రంలో కిట్టయ్యకు మంచి పాత్ర ఇచ్చాయి. ఆ తర్వాత ఇవ్వలేకపోయానని సుకుమార్ తెలిపారు. 

రవి కిరణ్ దర్శత్వంలో రాజావారు రాణిగారు చిత్రం తెరకెక్కుతోంది. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఏఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.