Asianet News TeluguAsianet News Telugu

ఓటీటీకే సుకుమార్ ఓటు.. వేరే దారేముంది?

అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌,ఆహా వంటి ఓటీటీ వేదికలు బోలెడు ఉండటం కలిసివచ్చే అంశం అనేది అందరి నమ్మకం. కంటెంట్‌ నచ్చితే 20 శాతం అడ్వాన్స్‌ నిర్మాణానికి ముందే ఇస్తున్నారు. నిర్మాతలకు ఓటీటీ అడ్వాంటేజే. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆల్రెడీ నిర్మాణం పూర్తైన సినిమాల పరిస్దితి ఏమిటి అనేది నిర్మాతల ముందు ఉన్న పెద్ద క్వచ్చిన్. అయినకాడికి ఓటీటిలకు ఇచ్చేయటమేనా ..తప్పదా అంటే తప్పదనే వినిపిస్తోంది. 
 

Sukumar agreed to Uppena OTT release?
Author
Hyderabad, First Published Jun 14, 2020, 1:16 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో  తక్కువ పెట్టుబడితో  ఏడాదికి రెండు మూడు చిత్రాలు ఓటీటీ వేదికల కోసం నిర్మించగలిగితే మంచిది అని పెద్ద నిర్మాతలు సైతం ఓ నిర్ణయానికి వస్తున్నారు . అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌,ఆహా వంటి ఓటీటీ వేదికలు బోలెడు ఉండటం కలిసివచ్చే అంశం అనేది అందరి నమ్మకం. కంటెంట్‌ నచ్చితే 20 శాతం అడ్వాన్స్‌ నిర్మాణానికి ముందే ఇస్తున్నారు. నిర్మాతలకు ఓటీటీ అడ్వాంటేజే. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆల్రెడీ నిర్మాణం పూర్తైన సినిమాల పరిస్దితి ఏమిటి అనేది నిర్మాతల ముందు ఉన్న పెద్ద క్వచ్చిన్. అయినకాడికి ఓటీటిలకు ఇచ్చేయటమేనా ..తప్పదా అంటే తప్పదనే వినిపిస్తోంది. 

ఈ మేరకు దర్శకుడు సుకుమార్ సైతం తమ టీమ్ తో చర్చలు జరిపి తమ తాజా చిత్రం ఉప్పెనను సైతం ఓటీటికు ఇచ్చేయటమే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొదట్లో ఓటీటి ప్రపోజల్ ని వ్యతిరేకించినా, తర్వాత రోజు రోజుకీ మారుతున్న పరిస్దితుల్లో ఇదే బెస్ట్ రూట్ అనే నిర్ణయానికి సుకుమార్ వచ్చారట. దాంతో ఓటీటిలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్రేజ్ పోయేదాకా సినిమాని తమ దగ్గర పెట్టుకుని వెయిట్ చేయటం కన్నా మంచి రేటు మాట్లాడుకుని ఓటిటి కు ఇచ్చేయటమే బెస్ట్ అంటున్నారు. పరిస్దితులు బాగుంటే..ఆ తర్వాత థియోటర్ రిలీజ్ చేసుకోవచ్చని అనుకుంటున్నారట. 

మెగా మేనల్లుడు సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. అయితే లాక్ డౌన్ తో సినిమా విడుదలను వాయిదా వేసారు.  సుకుమార్ స్వయంగా ఇదంతా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చేసినట్లు సమాచారం. ఫైనల్ గా రన్ టైమ్ రెండు గంటల ముప్పై నిముషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది.
  
ఇక ఈ సినిమాపై నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు బాగా అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 22 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టు తమకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని, రంగస్దలం సినిమాలా ఆడుతుందని నమ్ముతున్నారు.  సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios