ప్రభాస్ తో చేసిన `సాహో`చిత్రం తెలుగులో వర్కవుట్ కాకపోయినా సుజీత్ వచ్చిన నష్టమేమీ కనపడలేదు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సైతం సుజీత్ ప్రతిభను గుర్తించి తనను డైరక్ట్ చేసే అవకాసం ఇచ్చారు. మలయాళంలో హిట్టైన `లూసిఫర్`ను చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేయటానికి రంగం సిద్దం చేసారు. ఆ రీమేక్ బాధ్యతలను సుజిత్‌కు  తీసుకుని స్క్రిప్టు వర్క్ చేసారు. తెలుగు వెర్షన్ కు తనదైన శైలిలో సీన్స్ రాసి నేరేషన్ వినిపించారు. అందుతున్న సమాచారం మేరకు చిరంజీవికు ఆ వెర్షన్ నచ్చలేదట. 

తన సినిమాలాగ లేదని, ఓ కథగా మంచి మార్పులు చేసారు కానీ, తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఏమీ చేయలేదని చెప్పారట. అలాగని సుజీత్ చెప్పిన నేరేషన్ బాగోలేదని కాదని, తనకు పెద్దగా కలిసొచ్చేది కాదని అభిప్రాయపడ్డారట. దాంతో కొద్ది కాలం పాట..ఈ రీమేక్ ని పెండింగ్ లో పెడదామని డిసైడ్ అయ్యి...కొరటాల సినిమా తర్వాత ఆలోచిద్దామని చెప్పేసారట. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని అర్దం చేసుకున్న సుజీత్ మరో ప్రాజెక్టుపై తన దృష్టిని పెట్టారట. 

తనకు మొదట బ్రేక్ ఇచ్చిన యూవి క్రియోషన్స్ వారితోనే తన తదుపరి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు వారికో స్టోరీ లైన్ వినిపించారట. ఆ కథ పూర్తి యాక్షన్ తో , ట్విస్ట్ లతో ఉంటుందని గోపీచంద్ తో చేద్దామని డిస్కషన్స్ నడుస్తున్నట్లు సమాచారం. గోపీచంద్ డేట్స్ ప్లాబ్లం వస్తే కనుక శర్వాతో చేద్దామన్నారట. స్క్రిప్టు వరకు ఇప్పటికే యూవి క్రియోషన్స్ కు చెందిన వంశీ, ప్రమోద్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పూర్తి స్క్రిప్టు రెడీ చేసుకుని అప్పుడు గోపీచంద్ కు నేరేషన్ ఇస్తారట. అలా యూవి క్రియోషన్స్ సాయంతో సుజీత్..యుటర్న్ తీసుకున్నారు.