Asianet News TeluguAsianet News Telugu

‘శ్రీదేవి సోడా సెంటర్’ ..టాక్ కు ,కలెక్షన్స్ సంబంధమే లేదు

 ఈ చిత్రం ఆగష్ట్ 27న విడుదల య్యింది.సుధీర్ బాబు, ఆనంది ల పాత్రలకి మంచి మార్కులే పడ్డాయి.కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ మొదటిి రోజు మాత్రం ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి.అయితే రెండు రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

Sudheer Babu Sridevi Soda Center posts low numbers
Author
Hyderabad, First Published Aug 31, 2021, 7:40 AM IST

సుధీర్ బాబు హీరోగా  ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ’70.ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదల అయ్యింది. రిలీజ్ రోజు మార్నింగ్ షోకు సినమా బాగుందని అన్నారు. రివ్యూలలో సుధీర్ బాబు, ఆనంది ల పాత్రలకి మంచి మార్కులు వేసారు. ఓపెనింగ్స్  బాగానే నమోదు అయ్యాయి. అయితే రివర్స్ లో సినిమా యావరేజ్ అంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దాంతో కలెక్షన్స్ డ్రాప్ అవ్వటం మొదలైంది.

అప్పటికీ మహేష్ బాబు ఈ చిత్రం ప్రమోషన్స్ ని భుజాన వేసుకున్నారు. ట్వీట్ చేసారు. సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. మరో ప్రక్క ప్రభాస్ సైతం ఈ సినిమా ప్రమోషన్స్ కు సాయపడ్డారు. అయినా ఫలితం లేదు. వీకెండ్ కలెక్షన్స్ డల్ గా ఉన్నాయి. ఇంక సోమవారం నాడు అయితే మరీ దారుణం. యాభై శాతం కూడా రికవరీ ఇప్పటిదాకా లేదంటున్నారు.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు శ్రీదేవీ సోడా సెంటర్ సుమారు 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందింది. నాన్ థియేట్రికల్ హక్కుల అమ్మకంతో దాదాపు రూ.12.5 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో చిత్రం రిలీజ్‌కు ముందే రూ.4.5 కోట్ల లాభాన్ని నిర్మాతలు తమ ఖాతాలో వేసుకొన్నారంటున్నారు. ఇక థియేట్రికల్ రైట్స్‌తో ఈ చిత్రం రూ.8 బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా లక్ష్యం ఏకంగా రూ.8.5 కోట్లుగా ట్రేడ్ వర్గాలు నిర్ధేశించాయి. అయితే ఇప్పుడు ఎనిమిది కోట్లు కూడా వెనక్కి తిరిగి వచ్చే పరిస్దితి లేదంటున్నారు. ఉప్పెన స్దాయిలో ఆడుతుందని అంచనా వేసి ఉత్సాహపడి కొన్న వారు కలెక్షన్స్ చూసి కంగారుపడుతున్నారు. బ్రేక్ ఈవెన్ కు ఈ సినిమా చాలా దూరంలో ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios