నటుడు సుబ్బరాజుపై కేటీఆర్ ట్వీట్!

Subbaraju gives check to cm Relief Fund
Highlights

రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో నేను ఉండగా, సుబ్బరాజ్ నా వైపు నడుచుకుంటూ వచ్చి ఆశ్చర్యపరిచారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఓ చెక్ ను కంట్రిబ్యూట్ చేశారు. చాలా థాంక్స్ బ్రదర్

సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించే నటుడు సుబ్బరాజ్ 'బాహుబలి' చిత్రంతో నటుడిగా మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. విదేశాల్లో సైతం అతడికి అభిమానానులు పెరిగారు. రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు పోషించే సుబ్బరాజ్ రీల్ లైఫ్ లో మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ అందించి హీరో అనిపించుకున్నాడు.

సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రముఖులు విరాళాలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ నుండి ఇటీవల విజయ్ దేవరకొండ తన ఫిలిం ఫేర్ అవార్డు ను ఆక్షన్ లో పెట్టి దాని ద్వారా వచ్చిన రూ.25 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. అలానే ఇటీవల కేటీఆర్ ను కలిసిన సుబ్బరాజు అతడికి చెక్ అందజేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

'రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో నేను ఉండగా, సుబ్బరాజ్ నా వైపు నడుచుకుంటూ వచ్చి ఆశ్చర్యపరిచారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఓ చెక్ ను కంట్రిబ్యూట్ చేశారు. చాలా థాంక్స్ బ్రదర్' అని ట్వీట్ చేశారు. 

 

loader