సుబ్బరాజు విరాళానికి డ్రగ్స్ తో లింకేంటి..?

subbaraju gets trolled for giving cm relief fund
Highlights

 పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి ఉన్న కారణంగానే ఈ డ్రగ్స్ కేసుని పక్కన పెట్టారని, టాలీవుడ్ సెలబ్రిటీలు ఇందులో ఉండడం వలనే కేసు ముందుకు సాగకుండా చేస్తున్నారని దానికి ప్రతిఫలంగా ఇలా సెలబ్రిటీలు సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో చెక్ లు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి

బాహుబలి చిత్రంతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్న నటుడు సుబ్బరాజు ఇటీవల తెలంగాణ మినిష్టర్ కేటీఆర్ ను కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కొంత డబ్బుని చెక్ రూపంలో అందించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేటీఆర్ కు ఈ విషయంపై నెటిజన్లు వేస్తోన్న ప్రశ్నలు తలనొప్పిగా మారాయి.

గతేడాది తెలుగు సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ కేసులో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ అనే చెప్పాలి. చాలా మంది పెద్ద పెద్ద తారల పేర్లు ఈ వివాదంలో వినిపించాయి. కానీ కొద్దిరోజులకు ఈ విషయం మరుగున పడింది. సుబ్బరాజు పేరు కూడా డ్రగ్స్ వివాదంలో వినిపించింది. ప్రభుత్వాన్ని మంచి చేసుకోవడం కోసమే ఈ విరాళం ఇచ్చి ఉంటారని ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి ఉన్న కారణంగానే ఈ డ్రగ్స్ కేసుని పక్కన పెట్టారని, టాలీవుడ్ సెలబ్రిటీలు ఇందులో ఉండడం వలనే కేసు ముందుకు సాగకుండా చేస్తున్నారని దానికి ప్రతిఫలంగా ఇలా సెలబ్రిటీలు సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో చెక్ లు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకులు ఈ విషయాన్ని మరింత పెద్దదిగా చేస్తున్నారు.

loader