తమిళ స్టార్ హీరో ధనుష్ ను కోలీవుడ్ బ్యాన్ చేయబోతుందా..? ప్రొడ్యూసర్స్ ధనుష్ కు రెడ్ కార్డ్ ఎందుకు ఇష్యూ చేయాలనుకుంటున్నారు.. ? ఈ సంచలన నిర్ణయం వెనుక కారణం ఏంటీ..?
తమిళ స్టార్ నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారసత్వం ఉన్నా.. తన సొంత టాలెంట్ తో పైకి వచ్చాడు. స్టార్ హీరోగా తమిళనాట మంచి ఇమేజ్ సాధించాడు. ఇటు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రఘువరన్ బీటెక్, నవ మన్మధుడు లాంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్ గా తెలుగులో డైరెక్ట్ సినిమా చేశారు ధనుష్.. సార్ సినిమాతో స్సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వరుసగా సెట్స్ ఎక్కిస్తూ.. బిజీ బిజీగా ఉన్న ఉన్న ధనుష్ పై.. కోలీవుడ్ పెద్దలు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తమిళ నిర్మాతల మండలి ధనుష్‌కు రెడ్ కార్డు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే అతడితో ఏ దర్శకుడు, నిర్మాతలు ధనుష్ తో సినిమాలు చేయడాని వీలు ఉండదు. సాధ్యం కాదు. ఈ విషయం ప్రస్తుతం తమిళనాట సంచలనంగా మారింది. అసలు దీనికి కారణం ఏంటీ..?
థనుష్ అంటేనే సిన్సియారిటీ.. ఓ ప్రాణాళిక.. కమిట్ మెంట్. ఇలాంటి ఓ వంద పదాలక అర్ధం ధనుష్. అంత నిక్కచ్చిగా ఉంటాడు స్టార్ హీరో. అటువంటిది ధనుష్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఓ సినిమాలో నటిస్తానని మాట ఇచ్చాడట. ఇందుకోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. డబ్బులు తీసుకుని చాలా కాలం అవుతున్నా.. సినిమా మాత్రం చేయడంలేదు. అప్పటి నుంచి అడుగుతున్నా.. ఇప్పటి వరకు సినిమా మాత్రం చేయలేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసింది.
ఈ పిర్యాదుతో.. ధనుష్ పై చర్యలు తీసుకోవడం కోసం తమిళ నిర్మాతల మండలి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నిర్మాతను మోసం చేసినందుకు గాను.. ధనుష్‌కు రెడ్ కార్డ్ జారీ చేసే ఆలోచనలో నిర్మాతల మండలి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇదే జరిగితే.. తమిళనాట ఈ విషయం సంచలనంగా మారుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ విషయంలో ధనుష్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు.. చూడాలి. అంతే కాదు అసలు విషయం అక్కడివరకూ వెళ్తుందా.. లేక ధనుష్ మధ్యలో సెటిల్మెంట్ చేస్తాడా అనేది చూడాలి.
