అప్పట్లో రామ్ చరణ్ కు ఎందుకు సపోర్ట్ చేయలేదు...మగధీరతో పెద్ద స్టార్ అవటం ఇష్టంలేదా ఆయనకు , చరణ్ ని మోసం చేసాడంటూ డిస్కషన్ మొదలెట్టారు. పనిలో పనిగా అల్లు అరవింద్ ని విమర్శలతో ముంచెత్తుతున్నారు. అయితే అసలు అరవింద్ విమర్శలు చేసేటంత తప్పు జరిగిందా ..చూద్దాం.
ఓ మీడియా పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వూలో రాజమౌళి మాట్లాడుతూ...ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేసారు. “ప్రొడక్షన్ టీమ్ నాకు సపోర్ట్ చేసి ఉంటే బాహుబలి చేసినట్టే మగధీర చేసేవాడిని. రీసెంట్‌గా చరణ్, నేనూ ఇదే చర్చిస్తున్నాం. మంచి మార్కెటింగ్ ఉంటే, మగధీర మరింత భారీప్రశంసలను పొందగలిగేది.”. ఇప్పుడీ మాటలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసాయి. అల్లు అరవింద్ ..అప్పట్లో రామ్ చరణ్ కు ఎందుకు సపోర్ట్ చేయలేదు...మగధీరతో పెద్ద స్టార్ అవటం ఇష్టంలేదా ఆయనకు , చరణ్ ని మోసం చేసాడంటూ డిస్కషన్ మొదలెట్టారు. పనిలో పనిగా అల్లు అరవింద్ ని విమర్శలతో ముంచెత్తుతున్నారు. అయితే అసలు అరవింద్ విమర్శలు చేసేటంత తప్పు జరిగిందా ..చూద్దాం.
అయితే మగధీర నిర్మించేనాటికి రామ్ చరణ్ కి అది అత్యంత భారీ ప్రాజెక్టే. అప్పటికి రామ్ చరణ్ కు ఉన్న మార్కెట్ కు అనేక రెట్లు పెంచి అల్లు అరవింద్ ఖర్చు పెట్టారనేది నిజం. బడ్జెట్ విషయంలో వాస్తవానికి మగధీర షూటింగ్ దశలో ఉన్నపుడే విమర్శల పాలైంది. ఈ సినిమాకు 40 కోట్లు బడ్జెట్ అవసరమా.. రెండో సినిమాకే రామ్ చరణ్ కోసం ఇంత బడ్జెట్ పెట్టడం ఎందుకు అంటూ అప్పట్లో చాలా మంది విమర్శించారు కూడా. తేడా కొడితే రాజమౌళికి అక్షింతలు తప్పవని.. ఆయన ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుందని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అద్భుతం జరిగింది.
ఈ చిత్రం 2009లోనే 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రాజమౌళి రేంజ్ ఏంటో చూపించింది. తెలుగు సినిమా రేంజ్ కూడా మగధీర మార్చేసింది. అప్పటి వరకు చూసిన సినిమాలకు మగధీర ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పటికీ ఏ సినిమా తిరగరాయలేని రికార్డులెన్నింటినో సెట్ చేసి పెట్టింది మగధీర. అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ రికార్డును తన పేర రాసుకున్నాడు మగధీరుడు.
ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ రెండో సినిమాతోనే స్టార్ అయిపోయాడు. ఇప్పటికీ కూడా మగధీర సృష్టించిన కొన్ని రికార్డులు అలాగే పదిలంగా ఉన్నాయి. బాహుబలి సైతం వాటిని టచ్ చేయలేకపోయింది. అప్పట్లో ఉన్న తక్కువ టికెట్ రేట్లతోనే అద్భుతాలెన్నో చేసాడు మగధీరుడు. 223 కేంద్రాలలో 100 రోజలు.. 299 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. మరో పదేళ్లైనా కూడా మగధీర చరిత్ర ఇలాగే ఉంటుంది. అలాంటప్పుడు అల్లు అరవింద్ ని ఈ సినిమా విషయంలో విమర్శించటం తగదు. ఎందుకంటే ఆయన కుమారుడు అల్లు అర్జున్ పై కూడ ఇలా ఖర్చు పెట్టి ఇలాంటి సినిమా తీయలేదు.
