Asianet News TeluguAsianet News Telugu

కరోనా పోరు : రాజమౌళి చేస్తున్న సాయం మామూలుగా లేదు

మెగా డైరక్టర్  రాజమౌళి ఫ్యామిలి నుంచి ఏ విధమైన వార్తలు రాకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ విషయమై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ తాజాగా రాజమౌళి ను ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడారు. 

SS Rajamouli - Corona Virus Preventive Measures
Author
Hyderabad, First Published Mar 30, 2020, 8:55 AM IST

ప్రస్తుతం కరోనా పేరు వింటే చాలు ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి సెలబ్రెటీలు, భారత క్రికెటర్స్ అందరూ కరోనా బాధితుల కోసం విరాళాలు ప్రటిస్తున్నారు. తమ వంతు సాయిం చేస్తున్నారు. ఇప్పటికే మన తెలుగు పరిశ్రమ నుంచి హీరోలు విరాళాలు ఇవ్వటం మొదలెట్టారు. మొదట హీరో నితిన్ రూ.20 లక్షల విరాళంతో మొదలైన ఈ చేయూత.. పవన్ కళ్యాణ్ ,ప్రభాస్ వంటి స్టార్స్ భారీ విరాళాలతో ముందుకు వెళ్తోంది. అంతేకాదు..టాలీవుడ్ సూపర్ స్టార్లందరూ చేయి చేయి కలిపి ప్రభుత్వానికి తోడ్పాటు అందించే ప్రయత్నం చేస్తున్నారు. తమకు చేతనైంతలో సినీ పరిశ్రమలో పనుల్లేక అవస్థలు పడుతున్న కార్మికులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు.

మరి ఈ క్రమంలో మెగా డైరక్టర్  రాజమౌళి ఫ్యామిలి నుంచి ఏ విధమైన వార్తలు రాకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ విషయమై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ తాజాగా రాజమౌళి ను ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడారు. దానికి రాజమౌళి సమాధానమిస్తూ.. తమ కుటుంబం, ఆర్ఆర్ఆర్ యూనిట్ కరోనాపై పోరులో భాగమవుతోంది అని వివరించాడు రాజమౌళి. ఏ విధంగా భాగం అవుతున్నారో ఆయన చెప్పుకొచ్చారు.

రాజమౌళి మాట్లాడుతూ..తాము నేరుగా డబ్బుల విరాళం ఏమీ ఇవ్వట్లేదని.. ఐతే కరోనా కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులకు ప్రొటెక్టివ్ కిట్లు భారీ ఎత్తున అందజేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించాడు.డాక్టర్లు ధరించే ప్రొటెక్టివ్ సూట్లు ఖరీదైనవని.. అది ఒక్క రోజు ధరించి పక్కన పెట్టేయాల్సి వస్తుందని.. ఈ కష్ట కాలంలో నాణ్యమైన సూట్లు భారీ ఎత్తున అవసరమని.. వాటిని 'ఆర్ఆర్ఆర్' యూనిట్ తరఫునే కాక వ్యక్తిగతంగా కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు  వెల్లడించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios