ప్రస్తుతానికి పిల్లల ఆలోచన లేదు... ఇంకా సినిమాలు చేయాలి : శ్రియ

First Published 20, Jun 2018, 11:24 AM IST
sriya says as of now no any planning for kids
Highlights

ప్రస్తుతానికి పిల్లల ఆలోచన లేదు... ఇంకా సినిమాలు చేయాలి : శ్రియ

తెలుగు తెరపై కథానాయికగా ఒక వెలుగు వెలిగిన శ్రియ, సీనియర్ హీరోల సరసన ఇప్పటికీ అవకాశాలను దక్కించుకుంటూ ఉండటం విశేషం. ఈ క్రమంలో శ్రియ చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడం కూడా ఆమెకి బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న శ్రియ .. ఇక తన భర్తకి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటానని చెప్పింది. దాంతో శ్రియ ఇక సినిమాలకి టాటా చెప్పేసినట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే ఆమె మళ్లీ కెమెరా ముందుకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. "పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలు చేయకూడదనే రూల్ ఏమీ లేదు కదా .. ఇప్పుడప్పుడే పిల్లల ఆలోచన కూడా లేదు .. ఇంకా ఓ ఇరవై సినిమాలు చేయాలని వుంది" అనడం మరింత విస్మయానికి గురిచేస్తోంది.     

loader