నన్ను అత్యాచారం చేసి చంపుతామని బెదిరిస్తున్నారు : శ్రీరెడ్డి

నన్ను అత్యాచారం చేసి చంపుతామని బెదిరిస్తున్నారు : శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో ఎంతో మంది బడాబాబుల చీకటి గుట్టును బయటపెట్టింది శ్రీరెడ్డి. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని.. శారీరకంగా వాడుకున్నారని టాలీవుడ్ రసిక రాజుల కామకేళిని ఆధారాలతో సహా బయటపెట్టింది. అన్నింటికీ మించి తెలుగు హీరోయిన్స్‌ని న్యాయం చేయాలని కోరుతూ అర్థనగ్న ప్రదర్శన చేయడం ఆమె ధైర్యానికి సలాం అన్న వాళ్లే ఎక్కువ. అందుకే పలు మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆమె నిరసనకు మద్దతు ప్రకటించాయి. అయితే కాలక్రమంలో శ్రీరెడ్డి ఉద్యమం రాజకీయ రంగు పలుముకుంది. ఆమె ఉద్యమంపై దుష్టశక్తుల నీడ పడటంతో ఉద్యమం పక్కతోవ పట్టింది. కట్ చేస్తే.. ఆమెను పావులా వాడుకుని లాభపడిన వారు తామే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించామని బహిరంగంగా ప్రకటించడంతో శ్రీరెడ్డి ఉద్యమం కాస్తా నీరు కారిపోయింది. మొదట్లో ఆమెకు సపోర్ట్‌గా నిలిచిన వారందరూ మెల్లగా జారుకున్నారు. 

ఇప్పుడు శ్రీరెడ్డి ఒక్కరే ఒంటిరిగా హౌస్ అరెస్ట్ అయ్యారు. సెక్యురిటీ లేకుండా బయటకు రావాలంటే ఎవరేం చేస్తారన్న భయంతో బిక్కు బిక్కుమంటూ గత వారంరోజులుగా ఇంట్లోనే గడుపుతుంది. తాజాగా తనపై అత్యాచారం చేసేందుకు, హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని.. తనకు రక్షణ కల్పించాలని.. పోలీసులను, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా గురువారం నాడు తాను హౌస్ అరెస్ట్ ద్వారా తాను అనుభవిస్తున్న నరకాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలిపింది శ్రీరెడ్డి. ‘పురుగులు పట్టిన రవ్వతో భోజనం చేపిస్తున్న మహానుభావుల్ని జీవితంలో మరిచిపోలేను. గత వారం రోజులుగా హౌస్ అరెస్ట్‌లోనే ఉన్నా’ అంటూ తన పరిస్థితిని వివరించింది శ్రీరెడ్డి. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page