శ్రీరెడ్డి: నాని! నీ కాపురంలో నిప్పులే..

sri reddy sensational comments on hero nani
Highlights

'నాని + శ్రీరెడ్డి = డర్టీ పిక్చర్'... ఏంటీ ట్వీట్లు

శ్రీరెడ్డివి కవ్వింపు చర్యలు మాత్రమేనా? ఆమె దగ్గర అధరాలు వున్నాయా? అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. కానీ, కావాలని నేచురల్ స్టార్ నానీని టార్గెట్ చేస్తున్నారని మాత్రం అర్థమవుతోంది. కొన్ని రోజులుగా నానిపై శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు మాత్రం చూపడం లేదు. "నానికి, నాకు మద్య పచ్చగడ్డి వేస్తె భగ్గు మంటాది. ఏం చేద్దాం రా నాని??" అని ఓసారి ట్వీట్ వేశారు. అంతకు ముందూ అతడిపై చాలా ఆరోపణలు చేశారు.

ఈసారి ఓ అడుగు ముందుకేసి "నాని + శ్రీరెడ్డి = డర్టీ పిక్చర్... ఎప్పుడు? కమింగ్ సూన్! ఆన్ ద వే. నానిగాడి రాసలీలలు అన్ని బయట పెడతా. కాసుకోర నాని... నీ కాపురంలో నిప్పులే" అని చేసిన ట్వీట్ సంచలనమైంది.

గతంలో కొందరు సినీ ప్రముఖులతో జరిపిన వాట్సాప్ సంభాషణలను బయటపెట్టిన శ్రీరెడ్డి, త్వరలో వీడియోలు బయటపెడతారో? లేదంటే శేఖర్ కమ్ముల ఫైర్ అయినట్టు... నాని కూడా ఫైర్ అయితే... ఎవరో నానీని అన్నానంటూ ప్లేట్ ఫిరాయిస్తారో? ఒక్కటి మాత్రం నిజం... టీవీ మీడియాలో శ్రీరెడ్డికి మద్దతు మాత్రం లభించడం లేదు. ప్రారంభంలో ఆమెతో ప్రతిరోజూ డిబేట్లు కండక్ట్ చేసి, ఆమెకు పాపులారిటీ రావడానికి కారణమైన టీవీ మీడియా పట్టించుకోకపోవడంతో ఆమె గోడు వినేవారు కరువయ్యారు.

loader