మహేష్ మూవీ ‘భరత్ అనే నేను’ చూసి ఫిదా అయ్యానన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అక్కడితో ఆగలేదు. సదరు సినిమా హీరో, డైరెక్టర్లతో కలిసి ఒక స్పెషల్ ఇంటరాక్షన్ పెట్టుకున్నారు. సినిమాలోని కంటెంట్ మొత్తాన్ని జనానికి వివరిస్తూ విపులంగా మాట్లాడుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ టీవీల్లో ‘బ్యాక్ టు బ్యాక్’ అదేపనిగా టెలికాస్ట్ అవుతోంది. మంత్రిగారు సినిమాకు ప్రమోట్ చేస్తున్నారేంటి అనే డౌట్లు కూడా జనంలో పుట్టేశాయి.

ఈ గ్యాప్‌లోనే.. ‘క్యాస్టింగ్ కౌచ్’ ఫేమ్ శ్రీరెడ్డి సీన్లోకొచ్చేసింది. ఇండస్ట్రీలో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్‌ వివాదంపై కేటీఆర్‌ స్పందించాలంటూ పాత డిమాండ్‌నే మళ్ళీ ముందుకు తెచ్చిందామె. కేటీఆర్‌నుద్దేశించి గతంలో నాలుగైదు సార్లు ట్వీట్ చేసినా స్పందించలేదని.. పెద్ద హీరోల సినిమాలకు ప్రమోట్ చేయడానికి ఉత్సాహం చూపే కేటీఆర్.. తనలాంటి వాళ్లకు మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వరంటూ సూటిగా ప్రశ్నిస్తోంది కూడా..! ఈ మేరకు తన పాత ట్వీట్లతో కూడిన పోస్ట్‌ని ఫేస్‌బుక్‌లో పెట్టి.. కొత్త చర్చకు తెర లేపింది.