యూట్యూబ్ ఛానెళ్లలో.. టీవీ ఛానెళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ మధ్య కొందరు హీరోయిన్లు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆ కోవలోనే శ్రీ రెడ్డి అనే మాజీ హీరోయిన్ ఇటీవలే సెన్సేషనల్ కామెంట్లతో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు హీరోయిన్లను టాలీవుడ్లో ప్రోత్సహించకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ మీద సైతం తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో తనపై వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆమె తగ్గలేదు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో శ్రీ రెడ్డి మరింత రెచ్చిపోయింది. హీరోయిన్లు వ్యభిచారం చేస్తే తప్పేంటంటూ ఆమె ప్రశ్నించి సంచలనం రేపింది.

ఒక కథానాయికకు ఇష్టం ఉండి.. అవతలి వ్యక్తికి కూడా నచ్చి డబ్బులు తీసుకుని శృంగారంలో పాల్గొంటే వేరే వాళ్లకు అభ్యంతరమేంటని ఆమె ప్రశ్నించింది. తన దృష్టిలో ఇది తప్పే కాదని ఆమె అంది. హీరోయిన్ల గ్లామర్ చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని.. వాళ్లను చూసి ఆనందం పొందుతారని.. వాళ్లను ఊహించుకుని బాత్రూంల్లో ఏదో చేసుకుంటారని.. తన దృష్టిలో ఇవన్నీ వ్యభిచారంతో సమానమని.. అందులో తప్పులేనపుడు హీరోయిన్లు వ్యభిచారం చేస్తే తప్పేం లేదని ఆమె అంది. హీరోయిన్లు వ్యభిచారానికి పాల్పడినా వాళ్లకు ఇండస్ట్రీలో మద్దతు ఉంటుందని అన్న శ్రీ రెడ్డి.. శ్వేత బసు ప్రసాద్ ను బాలీవుడ్ వాళ్లు అక్కున చేర్చుకున్నారంటూ ఉదాహరణ ఇవ్వడం గమనార్హం.