శ్రీరెడ్డి గతంలోనూ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై మాటల యుద్దం చేసిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. అయితే ఆమె ఆ తర్వాత గత కొద్ది కాలంగా పవన్ గురించి మాట్లాడటం మానేసి,సెలైంట్ గా ఉంది. కానీ హఠాత్తుగా తెలంగాణా ఎలక్షన్ వేళ ఓ లైవ్ వీడియోతో జనం ముందుకు వచ్చింది. 

ఎవరికి ఓటు వేయాలి అనే విషయం దగ్గర నుంచి శబరిమలై విషయం దాకా రకరకాల టాపిక్స్ మాట్లాడుతూ పవన్ దగ్గరకు వచ్చి ఆగింది. తాను  పవన్ పై తను విమర్శలు తగ్గించేనే కానీ  పవన్ ను పూర్తిగా వదిలినట్లు కాదని, వదిలేది లేదని స్పష్టంచేసింది.

శ్రీరెడ్డి లైవ్ వీడియోలో లో మాట్లాడుతూ.."పవన్ కు ఇంకాస్త టైం ఉంది. అతడిపై త్వరలోనే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతాను. ఎవర్నీ వదిలిపెట్టేది లేదు. నా శపథం నెరవేర్చుకుంటాను. పవన్ ను ఆయన స్థానంలోనే ఓడిద్దాం. ఆయన ఎక్కడ నామినేషన్ వేస్తారో చూసి అక్కడే ఓడిద్దాం." అని తన అభిమానులకు పవన్ ని ఓడించమని పిలుపు ఇచ్చింది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

ప్రస్తుతం తాను కక్ష సాధింపులకు భయపడి చెన్నైలో ఉంటున్నానని,కేటీఆర్, కేసీఆర్ లపై వ్యంగ్య బాణాలు,కొన్ని సూటి ప్రశ్నలు వదిలింది. డ్రగ్స్ కేసు విషయమై ఆమె ప్రశ్నించింది. రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యమని చెప్పింది.

శ్రీరెడ్డి మాట్లాడుతూ.."టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎందుకు మూసేశారు. ఒకవేళ అది క్లోజ్ అవ్వకపోతే అప్ డేట్స్ ఏంటి. ఎవరు సప్లయ్ చేస్తున్నారు. ఎవరు వాడుతున్నారు. ఆ వివరాలు మీకు తెలియదా. మీరు ఐటీమంత్రి. నేను ఏదైనా నిజం మాట్లాడితే, మీ ఐటీ యంత్రాంగాన్ని ఉపయోగించి సోషల్ మీడియాలో నా జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తారు అంటూ చెప్పుకొచ్చింది. 

అలాగే పార్క్ హయత్ రాసలీలల్ని మీరెందుకు సీరియస్ గా తీసుకోరంటూ ప్రశ్నించింది. అప్పటి రాసలీలల్లో పేర్లన్నీ నాకు తెలుసు. పార్క్ హయత్ రాసలీలల్ని బయటపెడితే తనను హైదరాబాద్ రానివ్వరని, హైదరాబాద్ లో ఉన్న ఇంటిని కూడా తనకు దక్కకుండా చేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి.