పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రంలో పవన్ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొడుతున్నారు. తాజాగా మేకర్స్ చిత్ర ప్రీ షూటింగ్ సెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
తాజాగా ‘భీమ్లా నాయక్’ చిత్రంలో అలరించిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ Hari Hara Veera Mallu చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కాగా, ఈ భారీ చిత్రానికి పవన్ మరింత శ్రమిస్తున్నారు. హై యాక్షన్ సీన్లలో తన ఫ్యాన్స్ ను మెప్పించేందుకు యుద్ధ విద్యల్లో తన నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. అంతకు ముందు పవన్ సెట్‌లో యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయా ఫోటోలను కూడా యూనిట్ పంచుకుంది. ట్రైనర్ల సారథ్యంలో పవన్ గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తన బాడీని సైతం ఉక్కులా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మేకోవర్ కొత్తగా ఉండటం విశేషం. ఆ వెంటనే గ్యాప్ లేకుండా చిత్రీకరణ మొదలు పెట్టారు. ప్రస్తుతం పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.
తాజాగా మేకర్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్ టైంలో పవన్ కళ్యాణ్ ఎంతటి నైపుణ్యం చూపించారనే విషయాన్ని వీడియో రూపంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ‘ది వారియర్స్ వే’ The Warriors Way అంటూ ప్రీ షూట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ లో అదిరిపోయే యాక్షన్ సీన్లలో తన యుద్ధ నైపుణ్యాన్ని చూపించారు. మెరుపు వేగంతో బళ్లాలను దూస్తూ.. ప్రత్యర్థులను మట్టుబెడుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
పాన్ ఇండియా చిత్రంగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కబోతోంది. ఈ చిత్రం కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, పద్శ శ్రీ తోట తరణి సారథ్యంలో సెట్ వర్క్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నారు. కథనాయికగా హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agarwal) నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఏ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలోని మొఘల్ కాలం నాటి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

