ఛాన్స్ కోసం కాళ్లు మొక్కుతా అంటూ బతిమిలాడిన శ్రీముఖి

Sri mukhi frank cal Anchor suma
Highlights

ఛాన్స్ కోసం కాళ్లు మొక్కుతా అంటూ బతిమిలాడిన శ్రీముఖి

తెలుగులో ప్రధాన యాంకర్లు  సుమ, అనుసూయ, శ్రీముఖి, రష్మీ,  తదితరులు తన అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఇటీవల తెలుగులో స్టార్ట్ అయిన ఓ ఎంట ర్‌టైన్ ప్రొగ్రాంలో సుమను ఆటపట్టించేందుకు రష్మీ, శ్రీముఖి చేసిన ప్రాంక్ కాల్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. అసలు ఏం జరిగిందంటే.. రష్మీ యాంకర్‌గా వ్యవహరించే ఓ వినోద కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి ప్రాంక్ కాల్ చేయాల్సి వచ్చింది. దాంతో సుమకు ప్రాంక్ కాల్ చేస్తానని శ్రీముఖి చెప్పి కాల్ చేసింది. 

సుమకు శ్రీముఖి కాల్ చేసి.. గుంటూరు నుంచి నేను పుష్ఫను కాల్ చేస్తున్నాను. చాలా కష్టపడితే నీ ఫోన్ నంబర్ దొరికిందమ్మా. నీతో ఫోన్‌లో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది అని శ్రీముఖి గొంతు మార్చి చెప్పింది. నీతో మాట్లాడినందుకు ఈ రోజు అన్నం తిననే అని శ్రీముఖి అనగా.. మూడు రోజులు పాటు తినకు. చాలా మందికి భోజనం మిగులుతుంది సుమ బదులిచ్చింది. దాంతో టెలివిజన్‌లో మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు సుమమ్మా అని శ్రీముఖి అనగానే.. లేదమ్మా నేను ఫోన్‌లో మాట్లాడుతున్నాను అని సుమ పంచ్ ఇచ్చింది.సుమమ్మా నీవు ఊ అంటే ఒక్కసారి స్టార్ మహిళలకు వచ్చిపోతాను అని ఫోన్‌లో వెంటపడింది. నేను బిజీగా ఉన్నాను అని సుమ చెబుతుండగా.. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటా అని శ్రీముఖి చెప్పగా.. కావాలంటే నా కాళ్లు వాట్సప్‌లో పంపిస్తా.. అప్పుడు నా కాళ్లను పట్టుకో అని సుమ పంచ్ విసిరింది.

loader