బిగ్ బాస్ సీజన్ 3లో మిగిలిన కంటెస్టంట్స్ తో పోలిస్తే శ్రీముఖి మైండ్ గేమ్ ఆడుతుందనే చెప్పాలి. గొడవలకు దూరంగా ఉంటూనే వెనకాల మాట్లాడి ఎవరో ఒకరిని ఉసిగొలుపుతూ తనను ఎవరూ ఏమీ అనకుండా నైస్ గా డీల్ చేసేది. కొన్ని వారాల తరువాత శ్రీముఖి కాస్త కంట్రోల్ తప్పి రాహుల్ సిప్లిగంజ్ ని నేరుగా టార్గెట్ చేసింది. అయితే రాహుల్ కి 
జనాల సపోర్ట్ ఎక్కువ అవ్వడంతో శ్రీముఖి ఆటలు సాగలేదు.

రాహుల్ నామినేషన్స్ లో ఉన్న ప్రతీసారి అతడికి ఓట్లు ఎక్కువ పడుతున్నాయని గ్రహించిన శ్రీముఖి తన గేమ్ ప్లాన్ మార్చేసింది. అతడితో గొడవ పెట్టుకోవడం మానేసింది. అతడిని ఎలిమినేట్ చేయాలని చూస్తే తనకు అది సమయం మారుతుందని మిగిలిన స్ట్రాంగ్ కంటెస్టంట్ లను బయటకి పంపే ప్లాన్ చేస్తోంది.

బాబా భాస్కర్, శివజ్యోతి ఇద్దరికీ జనాల మద్దతు ఉందని గ్రహించిన శ్రీముఖి వ్యూహాత్మకంగా శివజ్యోతి హౌస్ లో రిలేషన్స్ పెట్టుకొని వాటిపై ఆధారపడుతూ గేమ్ ఆడుతుందంటూ బాబా భాస్కర్ తో చెప్పింది. దానికి అతడు కూడా వత్తాసు పలికాడు. దాంతో నిన్న జరిగిన కాలేజ్ టాస్క్ లో బాబా.. సివజ్యోతిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు.

దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తనకు గేమ్ తో పాటు హౌస్ లో సర్వైవ్ అవ్వడానికి రిలేషన్స్ కూడా ముఖ్యమని చెప్పి ఏడ్చేసింది. ఇది కాస్త బాబా భాస్కర్ కి నెగెటివ్ అయింది. ఈ విషయంలో ఇకపై ఎలిమినేషన్ సమయంలో శివజ్యోతి.. బాబా భాస్కర్ ని టార్గెట్ చేయడం ఖాయం. బాబా కూడా శివజ్యోతిని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరికి ఫైనల్స్ లోపు ఇబ్బందులు తప్పవు. మరి గేమ్ కోసం ఇన్ని ప్లాన్స్ చేస్తోన్న శ్రీముఖి విన్నర్ గా నిలుస్తుందో లేదో!