బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఎక్కడ ఉన్నా సినీ స్టార్స్, డ్రగ్స్ గురించే మాటలు వినపడుతున్నాయి. బాలీవుడ్ లో మొదలైన ఈ డ్రగ్స్ లింక్స్...కన్నడ పరిశ్రమను అయితే వణికిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమల్లోనూ పెద్ద పెద్ద పార్టీల్లో డ్రగ్స్ వాడతారని మీడియాలో వార్తలు సైతం వస్తున్నాయి. ఇదే సరైన టైమ్ అనుకున్నారో ఏమో ..డ్రగ్స్, పార్టీల నేపధ్యంలో రూపొందిన ఇట్స్ టైమ్ టు పార్టీ అనే సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది ఇంకెవరో కాదు శ్రీముఖి అవటం విశేషం.

‘టచ్’ అనే యాప్‌తో యువతీ యువకులను వలుపు వల విసిరే ఓ మాఫియా. డ్రగ్స్ పార్టీలతో... యూత్‌లో ఉన్న బలహీనతలను ఆసరాగా తీసుకొని వాళ్లను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంటుంది. అసులు దీని వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని కనుగొనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీముఖి నటించింది. అంతేకాదు పుట్టలో ఉన్న పాములను బయటకు తీసినట్టు.. ఈ చీకటి కోణం వెనకున్న పెద్దలను పట్టుకుంటానని చెబుతుంది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు.

బుల్లితెర యాంకర్ శ్రీముఖి నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’. సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఈవీఎస్ గౌతమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీముఖితోపాటు మాయా నెల్లూరి, ధ్రుతి ప్రియ నటిస్తున్నారు.