డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ఈ సారి మాస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తిప్పరా మీసం అంటూ టైటిల్ తోనే మంచి బజ్ క్రియేట్ చేస్తున్న శ్రీ విష్ణు ఇటీవల టీజర్ తో సినిమాపై మరింత అంచనాలను పెంచాడు. దీంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ కు ముందే లాభాలను అందుకుంటోంది.  

దాదాపు సినిమా బడ్జెట్ మొత్తం ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ తో వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది. తిప్పరా మీసం రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ 2.50కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 1.75కోట్లు వచ్చినట్లు టాక్. కర్ణాటక హక్కులను 75లక్షలకు అమ్మిన చిత్ర యూనిట్ కి డిజిటల్ - శాటిలైట్ రైట్స్ ద్వారా 2.50కోట్లు దక్కినట్లు తెలుస్తోంది.  

మొత్తంగా ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా చిత్ర నిర్మాతలకు సినిమా విడుదల కాకముందే 7.50కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ బిజినెస్ తో శ్రీ విష్ణు మార్కెట్ ఏ విధంగా పెరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. గత సినిమాలు కూడా చాలా వరకు కుర్ర హీరోకు కమర్షియల్ గా కూడా కలిసొచ్చాయి. మరి సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.