Asianet News TeluguAsianet News Telugu

విగ్గు తీసి మాట్లాడు ముసలి నక్కా, మగతనం ఉందా?...నాగబాబును బండ బూతులు తిట్టిన శ్రీరెడ్డి

వెంట్రుక కూడా పీకలేరు అంటావా, పెట్టుకుంది విగ్గే కదా, ముందు విగ్గు తీసి మాట్లాడు, ముసలి నక్కా, నరకానికి దారి వేసుకుంటున్నావ్ అని శ్రీ రెడ్డి ఆ వీడియోలో నాగబాబును ఉతికి ఆరేసింది. శ్రీరెడ్డి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

sree reddy fires on nagababu over controversial posts over ys jagan ksr
Author
Hyderabad, First Published Oct 10, 2020, 5:49 PM IST

నాగబాబు ఆధ్వర్యంలో బొమ్మ అదిరింది అనే ఓ కామెడీ షో ప్రారంభం అయ్యింది. ఆ కామెడీ షోలో కమెడియన్స్ హరి, పొట్టి రియాజ్ లు సీఎం జగన్ ని అనుకరిస్తూ ఓ కామెడీ స్కిట్ చేయడం జరిగింది. ఆ స్కిట్ జగన్ ని ఎగతాళి చేస్తున్నట్లు ఉన్న నేపథ్యంలో ఆయన అభిమానులు తీవ్ర ఆవేశానికి గురయ్యారు. ఈ షోలో పాల్గొన్న నాగబాబు, శ్రీముఖి మరియు జానీ మాస్టర్ పై కూడా జగన్ అభిమానులు మండిపడడం జరిగింది. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో పొట్టి రియాజ్, హరి క్షమాపణలు చెప్పారు. 

ఐతే నాగబాబు మాత్రం వారిని మరింత రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా ట్రోల్స్ కి సమాధానంగా వెంట్రుక కూడా పీకలేరని ఓ పోస్ట్ పెట్టారు. అలాగే  సింహాసనం పై కూర్చున్న కుక్క ఫోటోని పోస్ట్ చేసి బొమ్మ అదిరింది అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ రెండు పోస్టులు జగన్ అభిమానుల కోపాన్ని మరింత రెట్టింపు చేశాయి. తాజాగా టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ శ్రీ రెడ్డి ఓ ప్రత్యేక వీడియో చేశారు. ఆ వీడియోలో శ్రీ రెడ్డి నాగబాబుపై బూతులతో విరుచుకు పడింది. 

శ్రీరెడ్డి మాట్లాడుతూ కనకపు సింహాసనంపై నీ లాంటి కుక్కను మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి కూర్చో పెడితే విశ్వాసం లేకుండా కాటు వేశావు అన్నారు. వినాశ కాలే విపరీత బుద్ధి, మీ అన్న గుండు చేయించుకొని తిరుగుతున్నాడు, చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలుస్తాడు. కానీ ఎస్పీ బాలు చనిపోతే కనీసం చూడడానికి రాడు, అన్నయ్యా అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తాడు అన్నారు.
 
నీ తమ్ముడేమో నీ మాటలకు, పార్టీకి సంబంధం లేదు అంటాడు. ఎంపీ సీటు ఇస్తే ఓడిపోయావ్. కామ్ గా కూతరు పెళ్లి చేసుకో..ఎవరైనా కొట్టారంటే అల్లుడు ముందు పరువు పోతుంది అని శ్రీరెడ్డి అన్నారు. ఓట్లు వేసి గెలిపించిన సీఎం జగన్ ని హేళన చేస్తావా? అసలు నువ్వు మగాడివేనా, మగతనం ఉందా అని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios