ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తోనే దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ  ప్రియా ప్రకాష్ వారియర్‌. మలయాళ సినిమా ఒరు ఆదార్‌ లవ్ సినిమాలో కన్ను గీటే సీన్‌తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఒక్కసారి బాలీవుడ్‌ సినీ ప్రముఖుల దృష్టిలో కూడా పడింది. ఆ క్రేజ్‌తోనే వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన శ్రీదేవి బంగ్లా సినిమాలో నటించి ఆకట్టుకుంది. అయితే ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించకపోవటంతో ప్రియా క్రేజ్‌ కాస్త మసకబారింది.

అయితే సినిమాల్లో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అదరగొడుతుంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌ రేంజ్‌లో హాట్ హాట్‌ ఫోటో షూట్‌ లు చేస్తూ ఇంటర్‌నెట్‌లో వేడి పుట్టిస్తున్న ఈ బ్యూటీ తాజాగా మరో సోషల్ మీడియా ప్లాట్‌ ఫాంలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యథిక మంది యూజ్ చేస్తున్న టిక్‌ టాక్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియా ప్రకాష్‌.

ఒమర్‌ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఒకె ఆదార్‌ లవ్‌ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి ట్రైలర్‌ తోనే ఈ సినిమాకు జాతీయ స్థాయిలో క్రేజ్‌ రావటంతో ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ భారీగా రిలీజ్ చేశారు. అయితే అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు డిజాస్టర్ టాక్‌ వచ్చింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

It’s #priya.prakash.varrier99 💜Keep supporting!

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on May 7, 2020 at 6:56am PDT