లాక్‌ డౌన్‌లో రియల్‌ హీరోగా నిలిచిన తెర విలన్‌ సోనూ సూద్‌.. న్యూ ఇయర్‌ వేళ చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఆనందానికి అవదుల్లేకుండా పోయాయని చెప్పొచ్చు. కారణం.. ఆయన బిగ్‌బీ అమితాబ్‌ని కలిశారు. అమితాబ్‌ హోస్ట్ గా హిందీలో `కేబీసీ(కౌన్‌ బనేగా కరోడ్‌పతి) ప్రసారమవుతుంది. 

తాజాగా కేబీసీలో సోనూ సూద్‌ సందడి చేశారు. తనపై రాసిన పుస్తకం `ఐ యామ్‌ నో మెస్సయ్య` పుస్తకాన్ని అందించారు. ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. ఈ విషయాన్ని సోనూ సూద్‌ తెలిపారు. నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఏంటీ మార్గం అనుకున్నప్పుడు.. నేను ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రియమైన, ఆరాధించబడిన పురుషులలో ఒక్కరితో ఉన్నాను. 

ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు కేబీసీలో నా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాం.  సోదరభావంతో ఉన్న ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడు బెస్ట్ చేస్తూనే ఉండండి` అని తెలిపారు. ఈ సందర్భంగా కేబీసీలో బిగ్‌బీతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఫోటోని పంచుకున్నారు సోనూ సూద్‌. 

ఇదిలా ఉంటే ఇటీవల `ఆచార్య` సెట్‌లో చిరంజీవికి ఈ పుస్తకాన్ని అందించారు సోనూ సూద్‌. ఈ సందర్భంగా చిరంజీవితో దిగిన ఫోటోని పంచుకున్నారు. ఇక లాక్‌ డౌన్‌లో సోనూ సూద్‌ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వాటికి రైటర్‌ మీనా అయ్యర్‌ `ఐ యామ్‌ నో మెస్సయ్య` పేరుతో పుస్తక రూపం ఇచ్చారు.