Asianet News TeluguAsianet News Telugu

సోనూ సూద్‌ను అడ్డుకుంది పోలీసులు కాదు

ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు శ్రామిక్ రైలులో వెళ్ల‌నున్న వ‌ల‌స కార్మికుల‌ను క‌లిసేందుకు సోనూసూద్ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేష‌న్‌కు చేరుకున్నాడు. అయితే అత‌డి ప్ర‌య‌త్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అత‌డిని స్టేష‌న్‌లోనికి పంపించ‌కుండా బ‌య‌టే ఆపివేశారు. దీంతో ముంబై పోలీసుల తీరుపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై స్పందించిన ముంబై పోలీసులు సోనూ సూద్ ని అడ్డుకున్న‌ది తాము కాద‌ని, రైల్వే పోలీసులని స్ప‌ష్టం చేశారు. 

Sonu Sood stopped from meeting migrant workers
Author
Hyderabad, First Published Jun 10, 2020, 8:44 AM IST

గత కొద్ది కాలంలా తెరపై విలన్ పాత్రలు పోషించే సోనూసూద్..రియల్ హీరోగా మారారు. దేశం మొత్తం ఆయన సేవలకు జై కొడుతోంది. లాక్‌డౌన్ కార‌ణంగా చిక్కుకుపోయిన‌ వ‌ల‌స కార్మికులను ఆదుకుంటూ… వారిని సొంత గ్రామాలకు తరలిస్తున్నా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు సోనూ సూద్.  కాశీ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు ఎవ‌రికి ఏ ఆప‌ద వ‌చ్చినా ఆదుకుంటాన‌ని, భ‌విష్యత్తులోనూ ఈ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తాని ఆయ‌న హామీ ఇవ్వటంతో అందరూ మెచ్చుకుంటున్నారు. 

ఈ క్ర‌మంలో మొన్న రాత్రి.. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు శ్రామిక్ రైలులో వెళ్ల‌నున్న వ‌ల‌స కార్మికుల‌ను క‌లిసేందుకు సోనూసూద్ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేష‌న్‌కు చేరుకున్నాడు. అయితే అత‌డి ప్ర‌య‌త్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అత‌డిని స్టేష‌న్‌లోనికి పంపించ‌కుండా బ‌య‌టే ఆపివేశారు. దీంతో ముంబై పోలీసుల తీరుపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై స్పందించిన ముంబై పోలీసులు సోనూ సూద్ ని అడ్డుకున్న‌ది తాము కాద‌ని, రైల్వే పోలీసులని స్ప‌ష్టం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని తెలిపారు. అయితే వలస కార్మికుల తరలింపు విషయంలో సీఎం ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని చూపడానికే సోను సూద్ ని బీజేపీ రంగంలోకి దింపిందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. దాంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. సోషల్ మీడియాలో సోనూసూద్ ని మెచ్చుకుంటూ, పోలీస్ లను తిడుతూ పోకస్ట్ లు పెడుతున్నారు ఆయన అభిమానులు. 

ఈ విషయమై సోనూ సూద్ స్పందిస్తూ... ‘‘ముంబయిలో ఉన్న కార్మిక సోదరులకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాను. వారు స్పందించి నిన్న సాయంత్రం బాంద్రా నుంచి గోరఖ్‌పూర్‌కు రైలును ఏర్పాటు చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు కృతజ్ఞతలు. వారి సహాయం లేకుండా ఇది నాకు సాధ్యమయ్యే పని కాదు. కార్మిక సోదరులను కలిసేందుకు వెళ్లిన నన్ను... ప్లాట్‌ఫాం వద్ద రద్దీని నివారించేందుకు స్టేషన్‌లో అడుగుపెట్టనివ్వలేదు.

 అయితే నాకు కావాల్సింది నేను ప్లాట్‌ఫాం మీదకు వెళ్లటం కాదు... వలస సోదరులు వారి ఇళ్లకు వెళ్లటం. నన్ను స్టేషన్‌లోకి అనుమతించక పోయినా పర్వాలేదు. అది నాకు సమస్య కాదు. నేను నియమాలను పాటిస్తాను. నేను వారిని ప్లాట్‌ఫాం వద్ద కలవలేకపోయినా... బయట కలిసాను.’’ అని వివరించారు. మరో ప్రక్క శ్రామిక జీవుల తరలింపు కోసం బస్సులను ఏర్పాటు చేయడాన్ని ఉధ్ధవ్ థాక్రే అభినందించారు. ఈ విషయంలో ఎవరు, ఎలా కృషి చేసినా అభినందనీయమేనన్నారు. అటు-సూద్ చూపిన చొరవను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించిన సంగతి విదితమే. అంతేకాకుండా తన వద్ద ఇంకా వేలాది కార్మికుల జాబితా ఉందని, వారిని బస్సులు, కార్లు, ట్రైన్లు, విమానాలు... ఎలా వీలైతే అలా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios