Asianet News TeluguAsianet News Telugu

మరోసారి సల్మాన్‌ను టార్గెట్ చేసిన హాట్‌ సింగర్‌

మరోసారి సల్మాన్‌ను టార్గెట్ చేసింది ఈ హాట్ సింగర్‌. సల్మాన్‌కు ఏ మాత్రం సంబంధం లేని ఓ టిక్‌ టాక్‌ విషయంలో కండలవీరుడిని లాగి మరి వివాదం సృష్టించింది. ఇటీవల టిక్‌ టాక్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో ఓ కుర్రాడు తన ప్రేమను అంగీకరించని అమ్మాయి మీద యాసిడ్ దాడి చేస్తాడు.

sona mohapatra controversial comment on salman khan
Author
Hyderabad, First Published May 19, 2020, 5:38 PM IST

తన పాటలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయిన అందాల భామ సోనా మహాపాత్ర. గ్లామర్‌ షోతో కిక్కెక్కిచే ఈ బ్యూటీ అదే స్థాయిలో వివాదాస్పద ట్వీట్‌లు చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటుంది. ముఖ్యంగా సల్మాన్‌ ఖాన్‌ను టార్గెట్‌ చేస్తూ సోనా చేసే ట్వీట్లు ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యాయి. గతంలో భారత్ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్‌ ను టార్గెట్‌ చేస్తూ ట్వీట్లు చేసింది సోనా. ఆ సినిమా నుంచి ప్రియాంక చోప్రా తప్పుకోవటంతో ఆ విషయాన్ని సల్మాన్ స్వయంగా వెల్లడించాడు. అయితే ఆ విషయంపై సోనా స్పందిస్తూ సల్మాన్‌ చేసిన ట్వీట్‌ను తప్పు పట్టింది.

తాజాగా మరోసారి సల్మాన్‌ను టార్గెట్ చేసింది ఈ హాట్ సింగర్‌. సల్మాన్‌కు ఏ మాత్రం సంబంధం లేని ఓ టిక్‌ టాక్‌ విషయంలో కండలవీరుడిని లాగి మరి వివాదం సృష్టించింది. ఇటీవల టిక్‌ టాక్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోలో ఓ కుర్రాడు తన ప్రేమను అంగీకరించని అమ్మాయి మీద యాసిడ్ దాడి చేస్తాడు. ఆ వీడియో మహిళ మీద దాడులను ప్రొత్సహించినట్టుగా ఉందని ఆరోపిస్తూ చాలా మంది నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. అంతేకాదు టిక్‌ టాక్‌ నుంచి వీడియోను డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ వీడియోపై స్పందించిన సోనా వివాదంలోకి సల్మాన్‌ ఖాన్ ను లాగింది. ఆ వీడియోను సల్మాన్‌తో పోలుస్తూ వివాదాస్పద ట్వీట్ చేసింది సోనా. `లోకంలో నాడు నేడు మహిళలను కించపరచటంతో పెద్దగా మార్పు లేదు. మనం హీరో సల్మాన్‌ గురించి కథలు కథలుగా వింటూ పెరిగాం. సల్మాన్ హీరోయిన్‌ల ముఖాల మీద పబ్లిక్‌గా బాటిల్స్‌ పగలగొట్టేవాడు. అతన్ని కంట్రీ బిగ్గెస్ట్ స్టార్‌గా చూడటం మానండి` అంటూ ట్వీట్ చేసింది.. దీంతో మరోసారి సల్మాన్‌ ఫ్యాన్స్‌ సోనా మీద ఫైర్‌ అవుతున్నారు. గతంలో సోనాను చంపేస్తామంటూ కూడా బెదిరించారు సల్మాన్ అభిమానులు, ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios