అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి భర్త పర్సనల్ విషయం ఫ్యాన్స్ తో పంచుకుంది. సోషల్ మీడియా చాట్ లో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్ వైఫ్స్ లో స్నేహారెడ్డి (Snehareddy)ఒక్కరు. అల్లు అర్జున్ భార్యగా పరిచయమైన ఆమె సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఆమెకు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 7.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఓ స్టార్ హీరోయిన్ కి ఉండే ఫాలోయింగ్ అది. ఆమెను అంతగా అభిమానించడానికి కారణం.. తరచుగా అభిమానులతో టచ్ లో ఉంటారు. ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అలాగే గ్లామరస్ ఫోటో షూట్స్ లో పాల్గొంటారు.
తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అనేక రకాల ప్రశ్నలు అడిగారు. కాగా ఓ అభిమాని అల్లు అర్జున్ (Allu Arjun)ఇష్టపడే ఫుడ్ ఐటమ్ ఏమిటో చెప్పాలని కోరారు. ఆ ప్రశ్నకు సమాధానంగా...బన్నీ బిర్యానీ అమితంగా ఇష్టపడతారని, ఆయన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అదేనంటూ వెల్లడించారు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే అభిమానులకు స్టార్ హీరోలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా విలువైనదే. మరి బన్నీ బిర్యానీ ప్రియుడని తెలిసిన అభిమానుల్లో చాలా మంది బిర్యానీ లవర్స్ గా మారిపోవడం ఖాయం.
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టారు. ఈ మూవీ హిందీలో వంద కోట్ల వసూళ్లు దాటేసిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ వన్ సక్సెస్ నేపథ్యంలో పార్ట్ 2 భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పుష్ప పార్ట్ 2(Puspa 2) త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ విరామ సమయాన్ని బన్నీ ఫ్యామిలీ మెంబర్స్ తో గడుపుతున్నారు. బన్నీ తన బర్త్ డే వేడుకలు కుటుంబ సభ్యులు, మిత్రులతో విదేశాల్లో జరుపుకున్నారు.
దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సిరీస్ తెరకెక్కుతుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్న ఈ చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.
