మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదం రోజురోజుకి ముదిరిపోతుంది. ఎన్నికలు పూర్తయిన తరువాత అంతా సద్దుమణుగుతుందనుకుంటే ఇంకాస్త ఎక్కువయ్యాయి. 'మా' ప్రెసిడెంట్ గా గెలిచిన నరేష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ శివాజీరాజాపై ఆరోపణలు చేశారు.

శివాజీరాజా కూడా ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి నరేష్ కి సవాళ్లు విసురుతున్నారు. జీవిత రాజశేఖర్ పై కూడా శివాజీరాజా సంచలన కామెంట్స్ చేశారు. జీవితా రాజశేఖర్ లు తనపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు.

గతంలో జీవిత ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ నువ్ సరిగ్గా స్పందించలేదని అన్నారు. కానీ వాళ్ల బ్రదరే డ్రగ్స్ అమ్మాడని పేపర్ లలో, టీవీల్లో వచ్చిందని గుర్తు చేశాడు శివాజీరాజా. వాటిపై నేనేం స్పందింస్తానాని అన్నారు. నేను వెళ్లి వాళ్ల తమ్ముడిని పోలీసుల నుండి విదిపించలేను కదాఅని విమర్శించారు.

ఆ రెండు విషయాల్లో ఆమె అప్సెట్ అయిందని ఆ కారణంగానే ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానని అన్నారని చెప్పుకొచ్చాడు. నరేష్ కి నిజంగా స్త్రీల మీద గౌరవం ఉంటే జీవితను ప్రెసిడెంట్ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు.   

నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: శివాజీరాజా