Asianet News TeluguAsianet News Telugu

కులం అంది..సింగర్ స్మితకు ట్రోలింగ్ మొదలైంది

ట్వీట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి..చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశంకు సపోర్ట్ గా, జగన్ కు వ్యతిరేకంగా పెడుతుందని తెలుసు. కాబట్టి ఆమె ఏ పోస్ట్ పెట్టినా ఆ యాంగిల్ లోనే చూస్తూంటారు అభిమానులు. 

Singer Smitha posted a poem written by Gurram Jashuva
Author
Hyderabad, First Published Mar 18, 2020, 9:56 AM IST


తెలుగు నాట తొలి పాప్ సింగర్  హాయ్ రబ్బా స్మిత. అనేక సినిమాల్లో సైతం తన గాత్రంతో మాయ చేసిన ఆమె సోషల్ మీడియాలోనూ స్పీడుగా ఉంటూంంటారు. ప్రస్తుతం స్టేజ్ షోలతో దుమ్ము రేపుతున్న స్మిత...ఆ మధ్య బాహుబలి చిత్రానికి అంకితమిస్తూ ఒక పాప్ గీతాన్ని సైతం విడుదల చేసి వార్తల్లో నిలిచారు. అదే విధంగా  ‘నాపేరు ఆంధ్రా, నా వయస్సు ఐదేళ్లు’..  అంటూ  విడుదల చేసిన ఎన్నికల సందేశం ఓటర్లను ఆలోచింపజేసింది. ఆమె చంద్రబాబు నాయుడుకు వీరాభిమాని. ఆయనను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూంటుంది. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూంటాయి. అయితే ఆమె తాజాగా చేసిన ఓ ట్వీట్ ట్రోలింగ్ కి గురి అవుతోంది.
 
ఆమె ట్వీట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి..చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశంకు సపోర్ట్ గా పెడుతుందని తెలుసు. కాబట్టి ఆమె ఏ పోస్ట్ పెట్టినా ఆ యాంగిల్ లోనే చూస్తూంటారు అభిమానులు. తాజాగా ఆమె ప్రముఖ రచయిత గుర్రం జాషువా రాసిన ఓ కవిత పోస్ట్ చేసింది. ఆ కవిత్వంలో గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు అని ఉంటుంది. 
 
ఇక ఈ ట్వీట్ చూసిన వారంతా ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించిందే అంటున్నారు.ఆయన రీసెంట్ గా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎలక్షన్స్ వాయిదా వేసినందుకు కులమే కారణమని అన్నారు. 

https://twitter.com/smitapop/status/1239862080397697027

 దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వానికి కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలా ఎన్నికలు రద్దు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయుకుడు చంద్రబాబు నాయుడుది ఎలక్షన్ కమీషనర్ ది ఒకే కులం కాబట్టి ఇలా జరిగిందంటూ ఆరోపించారు. దీనికు స్మిత కౌంటర్ ఇచ్చినట్లైంది. 

అయితే ఈ విషయం గమనించిన జగన్ అభిమానులు ఊరుకోరు కదా..నీది అదే కులం అంటూ విమర్శలకు మొదలెట్టారు. చాలా మంది ఈ కులం గోల ఏంటి అంటూ ఆమెను తప్పు పడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమెకు కుల పిచ్చి మరికొందరు ఆరోపిస్తే..చంద్రబాబు సమస్యల్లో పడినప్పుడల్లా ఆమె ఇలాంటి పోస్ట్ లు పెడుతుందని మరికొందరు వ్యంగ్య బాణాలు విసురుతున్నారు. అంతటి మహాకవి జాషువాని అడ్డం పెట్టి ఇలాంటి పనులు చేయటం పద్దతి కాదని కొందరు సెటైర్స్ వేస్తున్నారు.మొత్తానికి ఆమె ట్వీట్ ఈ విధంగా పాపులర్ అవుతూ ట్రోలింగ్ కు గురి అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios