Asianet News TeluguAsianet News Telugu

“టెంపర్”రీమేక్ లో 'సింగం' ఎంట్రీ కలిసొచ్చింది

కొన్ని కమర్షియల్ ప్రయోగాలు సినిమా హిట్ ని బ్లాక్ బస్టర్ గా మార్చేస్తూంటాయి. ఇప్పుడదే “టెంపర్”బాలీవుడ్ రీమేక్ సింబాకు జరుగుతోంది.  

singam character in temper hindi remake talk
Author
Hyderabad, First Published Jan 2, 2019, 9:40 AM IST

కొన్ని కమర్షియల్ ప్రయోగాలు సినిమా హిట్ ని బ్లాక్ బస్టర్ గా మార్చేస్తూంటాయి. ఇప్పుడదే “టెంపర్”బాలీవుడ్ రీమేక్ సింబాకు జరుగుతోంది.  ‘టెంపర్’ లోని ఎన్టీఆర్ లంచగొండి పోలీసు పాత్రగా రణవీర్ సింగ్ తో సింబా పాత్రని సృష్టించి, దీనికి ‘సింగం’ సిరీస్ లోని అజయ్ దేవగణ్ బాజీరావ్ సింగం పాత్రతో జత కలిపి వదిలారు. దీంతో ఈ రీమేక్ కమర్షియల్ సినిమా జనాలు చేత విజిల్స్ వేయించే క్లైమాక్స్ ని తెచ్చి పెట్టి..పెద్ద హిట్ కు దారి తీసింది.  

డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన “టెంపర్” సినిమా తెలుగులో భారీ విజయాన్ని సాధించడంతో పాటు నటుడిగా ఎన్టీఆర్ ని మరో స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మాతగా, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో, రణవీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేసారు. 

సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నూతన సంవత్సర కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా మార్నింగ్ షో నుంచే కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపటం మొదలెట్టింది. సోమవారం పూర్తయ్యేసరికి ఈ సినిమా డొమాస్టిక్ మార్కెట్ లో 122.8 కోట్లు , డొమాస్ట్రిక్ మార్కెట్ లో  162.7 కోట్ల గ్రాస్ సంపాదించింది. 

తెలుగు టెంపర్ లోంచి కేవలం మూల కథను మాత్రమే తీసుకుని, నార్త్ ఆడియన్స్ కు తగినట్లుగా చేసిన మార్పులే సినిమా ఈ రేంజి హిట్ కు దారి తీసింది. సినిమాలో మంచి డైలాగులు, ఫన్, ఎమోషన్, హై ఓల్టేజ్ యాక్షన్ అన్ని  ఫెరఫెక్ట్ గా కుదిరాయి. మరీ ముఖ్యంగా సింగం సీరిస్ లోని అజయ్ దేవగన్ ని తీసుకుని వచ్చి ఈ సినిమాకు ముడి పెట్టడం బాగా కలిసొచ్చింది. సినిమా పడి పోతుంది అనుకున్న టైమ్ లో అజయ్ దేవగన్ పాత్ర ఎంట్రీ ఇచ్చి దుమ్ము రేపుతుంది. అలా ఒరిజనల్ లేని మార్పుని ఈ సినిమాకు జత చేసి హిట్ కొట్టాడు రోహిత్ శెట్టి.

మరో ప్రక్క ఈ చిత్రంలో సారా అలీఖాన్ తన అందచందాలతో అందరిని మంత్రముగ్దులను చేస్తోంది. ఈ సినిమాలో బాలేరావు అనే పోలీసాఫీసర్‌గా రణ్‌వీర్‌సింగ్ .సోనూసూద్ విలన్‌గా నటించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios