స్టార్ డైరక్టర్ శంకర్ రూపొందించిన `బాయ్స్` సినిమాతో తెలుగులో అందరి దృష్టిలో పడ్డాడు సిద్ధార్థ్. ఆపై `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `బొమ్మ‌రిల్లు` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ క్రమంలో సిద్దార్దకు ఇక్కడ యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అతని సినిమాలకు ఓ రేంజిలో ఓపినింగ్స్ ఉండేవి. అయితే అదంతా గతం. ఆయన సినిమాలు ఏమీ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. 

అప్పటికీ ఆఖరి ప్రయత్నం అన్నట్లుగా గతేడాది   `గృహం` అనే సినిమాతో తెలుగు, త‌మిళ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.  సినిమా రెండు భాష‌ల్లోనూ పెద్ద హిట్ కాదు కానీ ఓకే అనిపించుకుంది. దీంతో  బౌన్స్ బ్యాక్ అయ్యాడ‌న‌న్నారు. కానీ ఎక్కడా ఆఫర్స్ మాత్రం రాలేదు. సిద్దార్ద్ తో సినిమా చేయటానికి  ఏ ద‌ర్శ‌క, నిర్మాత  ఉత్సాహం చూపలేదు. దాంతో ఇది కాదు పద్దతి అని వెబ్ సీరిస్ ల వైపు దృష్టి పెట్టారు.

నెట్ ఫ్లిక్స్  నిర్మించిన `లీలా` అనే వెబ్ సిరీస్ లో న‌టించాడు. ఇది సిద్ధార్థ్ తొలి వెబ్ సిరీస్.  `మిడ్ నైట్ చిల్ట్రన్` దర్శకురాలు దీపా మెహతా ఈ సిరీస్ కి దర్శకత్వం వహించటంతో మంచి క్రేజ్ వచ్చింది.  హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటించింది. భారతదేశం నేపథ్యంలోని కథాంశంతోనే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

 ఇప్పుడు మరో వెబ్ సీరిస్ కూడా కమిటయ్యాడు. హాట్ స్టార్ కోసం ఆయన మరో స్టోరీని ఓకే చేసారు. లౌక్ డౌన్ ఎత్తేసాక పట్టాలు ఎక్కటానికి సిద్దంగా ఉంది. ఈ వెబ్ సీరిస్ లో మధుబాల (రోజా ఫేమ్) కలిసి నటించనున్నారు. అయితే ఆ వెబ్ సీరిస్ లో ఎవరి పాత్ర ఏమిటి...డైరక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.